seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 11:40 am Digital Edition : SEEMA KIRANAM

ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తా

ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తా

 

మసీదు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా.. సర్పంచ్ అభ్యర్థి తిరివీధి రమేష్

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 06 (సీమకిరణం న్యూస్):

 

ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పారిశ్రామికవేత్త, వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరివీధి రమేష్ హామీ ఇచ్చారు. శుక్రవారం వెల్దుర్తి పట్టణంలోని 15వ వార్డులో ఉన్న సఫా మసీదును టీవీఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్వాహకులు తిరివీధి సుధీంద్రతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో మర్యాదపూర్వకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మసీదుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని రమేష్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, గ్రామ అభివృద్ధి కోసం ముస్లిం సోదరుల సహకారం, మద్దతు కావాలని ఆయన కోరారు.