seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 2:15 pm Digital Edition : SEEMA KIRANAM

మున్సిపల్ ఎన్నికలు.. ఫైనల్ రిపోర్ట్ ఇదే.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు..? | తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026: SEC వార్డుల వారీగా విజయాలు ప్రకటించింది – కాంగ్రెస్ 1,537 స్థానాలతో ఆధిపత్యం

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుచుకున్న వార్డుల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,995 వార్డులకు కాంగ్రెస్ అత్యధికంగా 1,537 వార్డుల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 781, బీజేపీ 336, ఎంఐఎం 70, బీఎస్పీ 2, సీపీఎం 13, ఇతర పార్టీలు 73, స్వతంత్రులు 183 చోట్ల విజయం సాధించారు.

ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలయ్య ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌కు 39.08 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. అలాగే బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం, బీజేపీకి 15.67 శాతం, స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు నమోదైనట్లు చెప్పారు.

ఇక తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 1,347 వార్డుల్లో విజయం సాధించి 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీఆర్‌ఎస్‌ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీల్లో విక్టరీ కొట్టింది. అలాగే బీజేపీ అభ్యర్థులు 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. ఇక 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మిగిలిన స్థానాల్లో హంగ్ ఏర్పడింది. దానితో ఆయా ఫలితాలపై ఆసక్తి చూపింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 SEC ప్రకటించిన వార్డుల వారీగా కాంగ్రెస్ 1 537 సీట్లతో ఆధిపత్యం సాధించింది.

మరోవైపు మంత్రులు, సీనియర్‌ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా 38 హంగ్ మున్సిపాలిటీలపై నేతలు చర్చిస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20కు పైగా హంగ్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపు సమాచారం.

Source link