అంతర్జాతీయ
-కొరివి జయకుమార్
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో, నాయకత్వ సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Hosseini Khamenei) పాలనా పగ్గాలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ పదవి అనుభవం లేని ముజ్తబా, త్వరలోనే సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించబడతాయి.
ఆయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా. ఈయన 1969లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. 1979 ఇస్లామిక్ విప్లవంతో వారి కుటుంబం రాజకీయంగా ఎదిగింది. కోమ్‌లోని సెమినరీల్లో మత విద్యనభ్యసించిన ముజ్తబా.. అత్యున్నత ఆయతుల్లా ర్యాంకును అందుకోకపోయినా, సుప్రీం లీడర్ కార్యాలయంపై కీలక ప్రభావం చూపారు.

1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొని ఇరాన్ సైన్యానికి దగ్గరయ్యాడు ముజ్తబా. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆయనకు సుప్రీం పదవి దక్కడానికి ఇదొక కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకులు.
కాగా సుప్రీం లీడర్ నియామకాన్ని 88 మంది షియా మత పెద్దల ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ కమిటీ చేపడుతుంది. ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా సభ్యులను ఎన్నుకునే ఈ కమిటీ, వారసత్వ రాజకీయ మతాల సిద్ధాంతాలకు విరుద్ధమని అనిపిస్తుంది. ఈ కోరికనే, ముజ్తబా నియామకానికి కమిటీలోని కొందరు సుముఖంగా లేకున్నా, ఐఆర్‌జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగిస్తున్నారని సమాచారం.
ముజ్తబా ఇప్పటివరకు ఇరాన్‌లో అధికారిక పదవులు చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లో కనిపించేవారు. అయినా, రాజకీయ నియామకాలు, పాలనా నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. 2019లో అమెరికా ముజ్తబా ఖమేనీపై ఆంక్షలు విధించినా, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సంపన్న సామ్రాజ్యం ఉందని కథనాలు వెలువడ్డాయి. పశ్చిమ మార్కెట్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు, స్విస్ బ్యాంకుల్లో భారీ డిపాజిట్లు, బ్రిలో 138 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఆయన పేరు మీద ఉన్న సమాచారం.
ముజ్తబా 2004లో సంప్రదాయవాద రాజకీయ నాయకుడు ఘోలమ్ అలీ కుమార్తె జహ్రాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుటుంబ వివరాలు తెలియవు. ఇటీవల ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ముజ్తబా భార్య మరణించినట్లు వార్తలు వస్తున్నా, ధ్రువీకరణ అధికారిక ధ్రువీకరణ లేదు. ఇదే దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లు సమాచారం.
ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్ లోని మషాద్ తాజా ఖమేనీ ప్రార్థన స్థలంలోనే అంత్యక్రియలను నిర్వహించడం గురించి సమాచారం అందుతోంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు అంత్యక్రియలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఈ అంత్యక్రియల కార్యక్రమం మూడు రోజుల పాటు జరగడం జరిగింది.
మరోవైపు ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా.. వాళ్లని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ (కాట్జ్) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనుకునేవారిని వదిలిపెట్టేది లేదని తెలియజేసారు. ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా ప్రకటించారు. అతను ఎవరైనా.. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

