ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు
కర్నూలు ప్రతినిధి/ఎమ్మిగనూరు ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్) :

మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో భాగంగా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12:20 గం.లకు కలుగొట్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్, , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, డిఐజి కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి. వి. జయ నాగేశ్వర రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ.శ్యామ్ బాబు, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి వాల్మీకి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంత్రాలయం ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు ఇంఛార్జి వైకుంఠం జ్యోతి, కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, బోయ కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, శ్రీశైలం బోర్డు డైరెక్టర్ రేఖ గౌడ్, డి.సి.ఎంఎస్ నాగేశ్వర రావు, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, వివిధ పార్టీ నాయకులు తదితరులు ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు
ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తదుపరి మ.4:50 గం.లకు బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి . వెంకటేష్, డిఐజి కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి, అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.