seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 5:52 am Digital Edition : SEEMA KIRANAM

మారుతి ఈ-వితారా ధర లీక్?.. ఆ స్క్రీన్ షాట్ నిజమేనా? | మారుతీ ఇ విటారా ధర లీక్ అయిందా? వైరల్ రూ. 24.79 లక్షల స్క్రీన్‌షాట్ రియాలిటీ చెక్ మరియు స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి!

వ్యాపారం

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి నుంచి రాబోతున్న తొలి ఎలక్ కారు e-Vitara కోసం వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే వెల్లడైనప్పటికీ.. ధర విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ కారు ధరలకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ధర ఎంత?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో ఒక యూజర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. మారుతి ఇ-వితారా ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.79 లక్షలుగా ఉంది. ఇది మారుతి నెక్సా (నెక్సా) అధికారిక వెబ్‌సైట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌గా ప్రచారం.

మారుతి ఇ విటారా ధర లీక్ అయిన వైరల్ రూ. 24 79 లక్షల స్క్రీన్‌షాట్ రియాలిటీ చెక్ మరియు స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి

ఈ వార్తల్లో నిజమెంత?
ప్రస్తుతానికి మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా ఈ ధర కనిపించడం లేదు. అది వెబ్‌సైట్‌లో జరిగిన ఏదైనా సాంకేతిక లోపం లేదా ఎవరైనా ఎడిట్ చేసిన ఫోటో కానట్లు నిపుణులు నిర్ధారించారు. సాధారణంగా కొత్త కార్లను వెబ్‌సైట్‌లో జాబితా చేసేటప్పుడు డమ్మీ ధరలను ఉంచుతారు. పొరపాటున అది లైవ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

ఒకవేళ రూ.24.79 లక్షలు నిజమైతే?
ఒకవేళ ఈ ధర గనుక నిజమైతే.. మారుతి e-Vitara తన పరిధిని ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కంటే భారీ ధరతో ఉన్నట్లే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ మోడళ్ల కంటే ఇది సుమారు రూ. 6 లక్షల వరకు ఎక్కువగా ఉన్నాయి. ఇంత భారీ ధరతో పోటీని తట్టుకోవడం మారుతికి సవాలుగా మారవచ్చు.

మారుతి e-Vitara ప్రత్యేకతలు ఇవే:
ఈ కారును కంపెనీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో తీసుకువస్తోంది. 49kWh బ్యాటరీ.. ఇది బేస్ వేరియంట్ (డెల్టా)లో లభించనుంది. 61kWh బ్యాటరీ.. ఇది టాప్ వేరియంట్ (Zeta, Alpha)లో లభించనుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కి (ARAI సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారును గుజరాత్‌లోని ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాలకు ఈ కారును ఎగుమతి చేయాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి e-Vitara ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడే ఈ కారు అసలు ధరలు ఎంతో మనకు తెలుస్తుంది. అంతవరకు వైరల్ అవుతున్న వార్తలను పూర్తిగా నమ్మలేం.

ఆంగ్ల సారాంశం

మారుతీ ఇ విటారా ధర నిజంగా రూ. 24.79 లక్షలా? 2026కి సంబంధించిన రేంజ్, బ్యాటరీ స్పెక్స్ మరియు లాంచ్ అప్‌డేట్‌లతో పాటు వైరల్ Nexa వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్ వెనుక ఉన్న సత్యాన్ని తనిఖీ చేయండి.

Source link