seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 8:22 am Digital Edition : SEEMA KIRANAM

మానవత్వం చాటుకున్న ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, ఈవోఆర్డీ రవికిషోర్

మానవత్వం చాటుకున్న ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, ఈవోఆర్డీ రవికిషోర్

 

వెల్దుర్తి, జూన్ 8 (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా ఉలిందకొండ హైవేపై చెట్ల మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు వెల్దుర్తి ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, ఈవోఆర్డీ రవికిషోర్ మానవత్వంతో స్పందించి ఆదర్శంగా నిలిచారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, గాయపడిన వారిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా బాధితులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అధికారుల సమయస్ఫూర్తి, మానవీయ స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో ఇలాంటి సేవాభావం ఇతర అధికారులకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.