గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..బెల్లపు పరమేష్
కర్నూలు ప్రతినిధి నవంబర్ 22 (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మండల పరిధిలోని మాదార్‌పురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బెల్లపు పరమేష్ నామినేషన్ దాఖలు చేశారు. మాదార్‌పురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లక్ష్యంగా రమేష్ ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ దాఖలుతో మాదార్‌పురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది.