seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 3:48 am Digital Edition : SEEMA KIRANAM

మాటలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తాం : రమేష్ శెట్టి

14వ వార్డులో తిరువీధి రమేష్ శెట్టి విస్తృత ప్రచారం

 

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన సర్పంచ్ అభ్యర్థి.. అభివృద్ధికి మద్దతు కోరుతూ ప్రచారం

 

కర్నూలు ప్రతినిధి, నవంబర్ 24 (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి 14వ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి, 14వ వార్డు మెంబర్ అభ్యర్థి సజీవనాథ్ తో కలిసి 14వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు.
14వ వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఓటర్లకు వివరించారు. ప్రజలతో మమేకమవుతూ, ప్రతి వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని రమేష్ శెట్టి ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో స్థానికులు, మద్దతుదారులు పాల్గొనడంతో 14వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. మాటలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తామనే నినాదంతో రమేష్ శెట్టి ప్రచారం కొనసాగిస్తున్నారు.