seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:54 am Digital Edition : SEEMA KIRANAM

మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నివాళి

బింగిదొడ్డి మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నివాళి

 

శివశంకర్ రెడ్డి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

 

శివశంకర్ రెడ్డి మరణం తీరని లోటు.. పార్టీకి, గ్రామానికి పెద్ద దిక్కు కోల్పోయాం – మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

 

వెల్దుర్తి, సెప్టెంబర్ 09, (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు శివశంకర్ రెడ్డి మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. శివశంకర్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ బుధవారం వారి నివాసానికి చేరుకుని భౌతికదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శివశంకర్ రెడ్డి మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బింగిదొడ్డి జగన్ మోహన్ రెడ్డి, అల్లుగుండు శ్రీరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.