తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహిళా శక్తిని కొనియాడుతున్నారు. మహిళల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే నిజంగానే సమాజంలో మహిళల మీద ఇంత ఆదరణ ఉందా అంటే, సమాజంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు లేవు.
మహిళల పట్ల నిజమైన గౌరవం ఇదే
నేటికీ పనిచేసే చోట మహిళలపై కొనసాగుతున్న వివక్ష, మహిళలు, బాలికల పైన నేటికీ కొనసాగుతున్న అత్యాచారాలు, కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న లింగ వివక్ష వెరసి మహిళలు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అటువంటి మహిళా లోకం పట్ల నిజమైన గౌరవాన్ని ప్రదర్శించడం పిల్లల లింగ బేధం లేకుండా పెంచడమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహిళల పట్ల ఎన్టీఆర్ గౌరవం
మన సమాజంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ధోరణి మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే మహిళల పట్ల నిజమైన గౌరవం మాటల్లో కాదు చేతల్లో చూపించాలని భావించే వారిలో జూనియర్ ఎన్టీఆర్. నటుడు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నైతిక విలువలు ఉన్న వ్యక్తిగా సమాజంలో మహిళల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శించారు.
ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలి
తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన చాలా విలువైన ప్రకటన చేశారు. బెంగళూరులో జరిగిన ఎన్టీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని ఆయన పేర్కొన్నారు. ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించే విధంగా తన ఇద్దరు కుమారులను పెంచుతానని జూనియర్ ఎన్టీఆర్ మహిళా దినోత్సవం సాక్షిగా.
విలువైన మాట చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
తన కుమారులను మహిళల పట్ల గౌరవభావంతో పెరిగేలా తాను బాధ్యతలు స్వీకరించానని ఇద్దరు చెప్పారు. తనకు ప్రతీసారి మహిళలను ఏ విధంగా గౌరవించాలి అనేది గుర్తు చేయడం ఇష్టం లేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సమాజంలో అటువంటి మార్పు రావాల్సిన అవసరాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. మహిళా దినోత్సవం రోజున చాలా విలువైన మాట జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు విన్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంగ్ల సారాంశం
తన ఇద్దరు కుమారులను మహిళలను గౌరవించేలా పెంచడం గురించి jr ntr శక్తివంతమైన మాటలను పంచుకున్నారు. విలువలు మరియు సమానత్వాన్ని బోధించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన నటుడు, అతను తన పిల్లలను ఎల్లప్పుడూ మహిళలను గౌరవించే మరియు గౌరవించేలా పెంచుతున్నానని చెప్పాడు.