seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 9:01 am Digital Edition : SEEMA KIRANAM

మహిళలకు రూ 2500, పెన్షన్ల పెంపుపై బడ్జెట్ లో తేల్చింది..!! | తెలంగాణ బడ్జెట్ హామీలను విస్మరించినందుకు విమర్శలను అందుకుంది, పెన్షన్లు కేవలం ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి, ఇక్కడ వివరాలు

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అయితే, మూడు కొత్త పథకాలు ప్రకటించిన భట్టి… పెండింగ్ హామీల పైన స్పష్టత ఇవ్వలేదు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-28 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్ రూ.3,24,234 కోట్లుగా ప్రతిపాదించారు. అందులో మొత్తం వ్యయం రూ.2,34,406 కోట్లు గా..మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా వెల్లడించగా.. వృద్ధి రేటు 10.2 శాతంగా బడ్జెట్‌లో వివరించబడింది.

హామీలను విస్మరించినందుకు తెలంగాణ బడ్జెట్‌లో విమర్శలు వస్తున్నాయి పింఛన్లు మాత్రమే ఉపశమనాన్ని అందిస్తాయి ఇక్కడ వివరాలు

కాగా, ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలో ని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికిఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందజేస్తుంది జూన్, 02, 2026 నుండి”ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం”నునూతనంగా ప్రవేశపెడుతున్నట్లు. అదే విధంగా విద్యార్ధులకు సంబంధించి రెండు కొత్త పథకాలు అమలు చేయబడ్డాయి. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ ప్రస్తావన లేదు. కాగా.. పెండింగ్ హామీల గురించి స్పష్టత వస్తుందని ఆశించారు.

పెండింగ్ హామీల అమలు పై లేని స్పష్టత

అయితే.. 2026-27 వార్షిక సంవత్సరంలో రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందించబడ్డాయి. కాగా.. ఎన్నికల సమయంలో పెన్షన్లను రూ.4 వేలు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్న వేళ ఈ బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా మహిళలకు నెలకు రూ 2,500 ఇస్తామని ఇచ్చిన హామీ పైన ప్రకటన ఉంటుందనే ప్రచారం సాగింది.

ఈ రెండు పథకాలు ఆర్దిక.. సమస్యల కారణంగా ఒకే సారి అమలు చేయక పోయినా.. విడతల వారిగా ఈ ఏడాది నుంచి అమల్లోకి తెస్తారనే వార్తలు వచ్చాయి. అయితే.. ఈ బడ్జెట్ లో పెండింగ్ లో ఉన్న ఈ రెండు హామీల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో బడ్జెట్. ఇందులోనూ ఈ హామీల ప్రస్తావన లేకపోవటంతో.. అసలు ఎప్పటి నుంచి వీటిని అమలు చేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారుతోంది.

ఆంగ్ల సారాంశం

తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో పెండింగ్ వాగ్దానాలను అమలు చేయడం గురించి ప్రస్తావించలేదు, పెన్షన్ పెంపు మాత్రమే ఉపశమనాన్ని అందిస్తుంది

Source link