మహా శివరాత్రి ముఖ్య నియమాలు
శివరాత్రి రోజు ఉదయం నుంచే ఉపవాసం ఉండాలి.. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు.
శివలింగానికి పంచామృతాలు, బిల్వ పత్రాలు, గంగాజలంతో భక్తితో అభిషేకం చేయాలి.
రోజంతా ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.
సమీపంలోని శివాలయానికి వెళ్లి లింగోద్భవ కాల పూజల్లో పాల్గొనడం శ్రేయస్కరం.
రాత్రంతా నిద్రపోకుండా శివ లీలలను వింటూ లేదా చదువుతూ దైవచింతనలో గడపాలి.
కోపతాపాలకు దూరంగా ఉంటూ, అందరినీ శివ స్వరూపంగా భావిస్తూ శాంతంగా ఉండాలి.
సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.