Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమహా శివరాత్రి ప్రత్యేక దర్శనం, కోటప్పకొండ పిలుస్తోంది. | మహా శివరాత్రి 2026: కోటప్పకొండ త్రికోటేశ్వర...

మహా శివరాత్రి ప్రత్యేక దర్శనం, కోటప్పకొండ పిలుస్తోంది. | మహా శివరాత్రి 2026: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తుల కోసం ఆన్‌లైన్ దర్శన బుకింగ్‌ను ప్రారంభించింది

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

మహా శివరాత్రి రోజు ప్రతి శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇక ప్రముఖ శైవ క్షేత్రాలు అడుగు తీసి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి తిరుణాళ్ల అంటే గుర్తుకు వచ్చేది. కోటప్పకొండ. దాదాపు 25 లక్షల మంది భక్తులు ఈసారి తిరుణాళ్లకు వస్తారని అధికారులు అంచానా వేశారు. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ కోరనే మహాశివరాత్రి పర్వదినాన.. శివయ్యన దర్శించుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.

పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో వెలసిన శ్రీ త్రికోటేశ్వరస్వామివారి దేవస్థానం మరోసారి మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఇప్పటికి గ్రామాల్లో ప్రభల నిర్మాణం పూర్తి కాగా.. దర్శనానికి వచ్చే భక్తుల కోసం నేటి నుంచి.. నుంచి వివిధ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి తెలిపారు.

మహా శివరాత్రి

భక్తుల సౌకర్యార్థం మండప అభిషేకం రూ.500, వీఐపీ దర్శనం రూ.300, శీఘ్ర దర్శనం రూ.200, ప్రత్యేక దర్శనం రూ.100గా నిర్ణయించారు. ఈ టికెట్లను aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ముందుగానే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మహాశివరాత్రి రోజున భారీగా భక్తులు తరలిరావనున్న నేపథ్యంలో, క్యూల రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

త్రికోటేశ్వర క్షేత్రం – ఒక అపూర్వ స్థల పురాణం

కోటప్పకొండను దక్షిణ కైలాసంగా భక్తులు పిలుస్తారు. మూడు శిఖరాలతో విరాజిల్లే ఈ కొండపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్థలంలో వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడి శివలింగాన్ని త్రికోటేశ్వరస్వామిగా పూజిస్తారు. శివభక్తులకు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరొందింది.

పూర్వకాలంలో దేవతలు, ఋషులు ఈ కొండపై తపస్సు చేసి శివకృప పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మహాశివరాత్రి నాడు ఇక్కడ దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

మహా శివరాత్రి తిరుణాళ్ల వైభవం

మహాశివరాత్రి రోజున కోటప్పకొండలో జరిగే తిరుణాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద శైవ ఉత్సవాల్లో ఒకటి. రాత్రంతా జాగరణ, ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహాన్యాస పూజలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతాయి. కొండపై వెలిగే దీపాలు, భజనలు, శివనామస్మరణతో వాతావరణం పూర్తిగా భక్తిమయంగా మారుతుంది.

మహా శివరాత్రి ప్రభలే హైలైట్

కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాళ్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ప్రభల ఊరేగింపు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రంగురంగుల ప్రభలతో తరలివచ్చి, శివుని మహిమను చాటుతారు భక్తులు. డప్పులు, చిందులు, హరిదాసు కీర్తనలు, శివనామ జపంతో ప్రభల ఊరేగింపు కన్నుల పండుగగా మారుతుంది. ఈ దృశ్యాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటారు.

భక్తులకు సూచన

భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు బుక్ చేసుకుని, అధికారుల సూచనలు పాటించాలని దేవస్థానం అధికారులు కోరుతున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ మహాశివరాత్రికి కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి దర్శనం భక్తులకు ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిగా నిలవనుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular