seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 4:52 am Digital Edition : SEEMA KIRANAM

మహాశివరాత్రి వేళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో టెన్షన్! | మహా శివరాత్రి సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్‌తో ఉద్రిక్తత.. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అలర్ట్

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఫిబ్రవరి 15వ తేదీ నేడు.. దేశమంతా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటే హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారి ఉలిక్కిపడింది. సింగపూర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు

సింగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు పెట్టారని ఇమెయిల్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను క్షేమంగా కిందికి దించి, ప్రయాణికులు వెళ్లిపోయిన తర్వాత భద్రతా సిబ్బంది విమానాలను ప్రత్యేక టెర్మినల్ వద్దకు తరలించి విస్తృత తనిఖీలను నిర్వహించారు. విమానంలో ఎక్కడ ఎటువంటి పేడు పదార్థాలు లభ్యం కావు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత, ఈమెయిల్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అలర్ట్

రెండు వ్యవధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 23 నకిలీ కాల్స్

అయితే ఈ బెదిరింపు ఈమెయిలు నకిలీదని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు నిర్ధారించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గతంలో అనేకసార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నకిలీ బాంబులు వచ్చాయి. గత డిసెంబర్ నుండి ఇప్పటివరకు రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 23 నకిలీ కాల్స్, నకిలీ ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ కేసుల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు విచారణలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్ అధికారులకు పోలీసులకు పెద్ద తలనొప్పి

పోలీసుల దర్యాప్తులో మరికొందరు విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ మెసేజ్ లు, నకిలీ కాల్స్, నకిలీ ఎయిర్‌పోర్ట్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా నేడు వచ్చిన ఈ మెయిల్ కూడా విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.

లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు

విచారణన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మూడు వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో నెలల బెదిరింపు కాల్స్, బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికారులు దీని వెనుక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

మహా శివరాత్రి వేడుకల మధ్య ఫిబ్రవరి 15న శంషాబాద్ ఎయిర్‌పాట్‌లో సింగపూర్ నుంచి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.

Source link