seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 6:55 am Digital Edition : SEEMA KIRANAM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలి : సిపిఐ

 

కొత్త పథకం విబి – జిరామ్ జి బిల్లు రద్దు చేయాలి : సిపిఐ

 

 

వెల్దుర్తి, ఏప్రిల్ 07, (సీమకిరణం న్యూస్):

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలని అలాగే కొత్త పథకం విబి -జిరామ్ జి బిల్లు రద్దు చేయాలని సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వెల్దుర్తి లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిశీలనకు వచ్చిన ఎన్ ఆర్ జీ డైరెక్టర్ షణ్ముఖ ఐఏఎస్ అధికారిని సిపిఐ బృందం కలిశారు. ఈ సందర్భంగా సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి గిరిబాబు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిపిఐ మండల నాయకులు అనిల్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని అదేవిధంగా కొత్త పథకం విభిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టాలని ఎనర్జీ డైరెక్టర్ షణ్ముఖకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.