అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
<!--
--> <!-- -->మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నెలకొన్న తరుణంలో ఇప్పుడు మరో వాతావరణంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్ధాలుగా ఉద్రిక్తతలకు నిలయమైన ఆఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా పేలుడు పదార్థంలా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్థాన్ ఇటీవల తమ భూభాగంపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్గాన్ ఇప్పుడు పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేస్తోంది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం.
అసలు ఏం జరిగిందంటే?
పాకిస్థాన్ ఆఫ్గానిస్థాన్‌లోని కాబూల్, కందహార్, పక్టియా, పక్టికా ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపి పౌరుల ప్రాణాలను బలిగొందని ఆఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి బదులుగా ఆఫ్గాన్ వాయుసేన ఫై పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని కోహాట్, ఇస్లామాబాద్‌లోని జాబాద్‌లో ఉన్న ‘హంజా’ అనే కీలక సైనిక కేంద్రంపై దాడులు చేసింది. తాలిబన్ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో పాక్ సైనిక వార్ కమాండ్ సెంటర్, గిడ్డంగులు, సైనికుల నివాస ప్రాంతాలకు భారీగా నష్టం వాటిల్లింది. సరిహద్దుల్లోని లక్కీ మర్వత్ జిల్లాలో పోలీసు వాహనంపై జరిగిన ఐడీ బాంబు దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని ‘తహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్’ ప్రకటించింది.

తీవ్రంగా మారుతున్న వివాదం
కందహార్ విమానాశ్రయం సమీపంలోని ‘కమ్ ఎయిర్’ ఇంధన డిపోపై పాకిస్థాన్ బాంబు దాడి చేసిందని తాలిబన్లు. ఈ డిపో ఐక్యరాజ్యసమితి విమానాలకు కూడా ఇంధనాన్ని అందిస్తుందని.. ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. సుమారు 2600 పొడవైన డ్యూరాండ్ లైన్ సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆఫ్గానిస్థాన్ ఈ సరిహద్దును గుర్తించకపోవడమే ఈ వివాదాలన్నిటికీ మూల కారణం.
ప్రపంచ దేశాల ఆందోళన:
మధ్యాచ్యంలో ఇప్పటికే యుద్ధం కొనసాగుతోంది, ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం పెరిగితే ప్రాంతీయ శాంతికి విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఆరోపణలను ఆఫ్గాన్ ప్రభుత్వం ఖండించగా.. పాకిస్థాన్ మాత్రం ఆఫ్గాన్ భూభాగం నుంచి తమపై దాడులు జరుగుతున్నాయని వాదిస్తోంది. ఏది ఏమైనా, ఆఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చే అవకాశం ఉందని మరో నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు దేశాలు సంయమనం పాటించకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది.
ఆంగ్ల సారాంశం
సరిహద్దు వైమానిక దాడులు మరియు ప్రతీకార దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. డ్యురాండ్ రేఖ వెంబడి పెరుగుతున్న సంఘర్షణ మరో ప్రాంతీయ యుద్ధ భయాలను పెంచుతుంది.