Thursday, March 12, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమరో కొత్త అమృత భారత్ రైలు.. తక్కువ ఖర్చుతో ఈశాన్య భారత్ ప్రయాణం | మార్చి...

మరో కొత్త అమృత భారత్ రైలు.. తక్కువ ఖర్చుతో ఈశాన్య భారత్ ప్రయాణం | మార్చి 13 నుంచి చెర్లపల్లి-కామాఖ్య మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్: ఈశాన్యానికి నేరుగా అనుసంధానం

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయి-లింగారెడ్డి గజ్జల

తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతదేశానికి (నార్త్-ఈస్ట్ ఇండియా) వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య నూతన ‘అమృత భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రారంభించనుంది. మార్చి 13, 2026 నుండి కామాఖ్య స్టేషన్ నుండి ఈ రైలు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి మరియు సామాన్య ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ రైలు, సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది.

అస్సాం రాష్ట్రం ఈశాన్య భారత దేశంలో ‘ఏడు సోదరి రాష్ట్రాల’కు (సెవెన్ సిస్టర్స్) ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. తాజా రైలు సౌకర్యంతో తెలుగు రాష్ట్రాల నుంచి అస్సాంకు నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ రైలులో కేవలం స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉండటం వల్ల, తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. పర్యాటకులు, పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తులు, ఉపాధి కోసం వలస వెళ్లే వారికి ఈ రైలు ఒక గొప్ప వరంగా మారనుంది.

చర్లపల్లి-కామాఖ్య మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ మార్చి 13 నుండి ఈశాన్యానికి నేరుగా కనెక్టివిటీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన స్టాపింగ్‌లు ఇవే:

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రంలో నిద్రించే సమయంలో ఈ రైలు రెండు దిశల్లోనూ కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధానంగా ఈ క్రింది ప్రాంతాల్లో హాల్టింగ్ ఇచ్చారు

  • తెలంగాణ: చర్లపల్లి, నల్గొండ.
  • ఆంధ్రప్రదేశ్: గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్.

ఈ నూతన రైలు కార్యక్రమాలతో రద్దీ సమయాల్లో ప్రయాణికులపై ఒత్తిడి తగ్గకుండా, ఈన్య రాష్ట్రాలతో వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని రైల్వే అధికారులు తెలిపారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular