seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 6:21 am Digital Edition : SEEMA KIRANAM

మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు | గూఢచర్యం కోసం IAF ఉద్యోగి అరెస్ట్: సుమిత్ కుమార్ క్షిపణి మరియు ఫైటర్ జెట్ రహస్యాలను పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లీక్ చేశాడు

[ad_1]

భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

భారత గగనతలాన్ని రక్షించే వాయుసేన కోటలో ఒక ‘అంతర్గత శత్రువు’ తిష్టవేసి, దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు పెట్టాడు. యుద్ధ విమానాల కదలికలు, క్షిపణి వ్యవస్థల రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తూ ‘విభీషణుడి’ పాత్ర పోషించిన వాయుసేన పౌర ఉద్యోగి సుమిత్ కుమార్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ నిఘా వర్గాలు జరిపిన మెరుపు దాడిలో ఈ భారీ గూఢచారి నెట్‌వర్క్ గుట్టు రట్టయింది.

ఈ ఆపరేషన్ ఒక చిన్న అనుమానంతో మొదలైంది. ఈ ఏడాది జనవరిలో జైసల్మేర్‌కు చెందిన ఝబారా రామ్ అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పాక్ హ్యాండ్లతో నిరంతరం టచ్‌లో ఉన్న ఒక ‘పెద్ద చేప’ గురించి రామ్ సమాచారం ఇచ్చాడు. ఆ క్లూ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అస్సాంలోని చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సుమిత్ కుమార్ అసలు రంగు బయటపడింది.

గూఢచర్యం కోసం IAF ఉద్యోగి అరెస్టు

డబ్బు కోసమే దేశద్రోహం: సోషల్ మీడియానే ఆయుధం!

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుమిత్ కుమార్, 2023 నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపినట్లు తేలింది. కేవలం కొన్ని వేల రూపాయల ఆశ చూపి పాక్ హ్యాండ్లర్లు ఇతడిని బుట్టలో వేసుకున్నారు. తన ఉద్యోగ హోదాను అడ్డం పెట్టుకుని, వాయుసేనలోని అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియా ద్వారా సరిహద్దులు దాటించాడు.

యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల మోహరింపు వివరాలు. చబువా, బికనీర్ (నల్) వంటి కీలక ఎయిర్ బేస్‌ల మ్యాపులు. కీలక అధికారులు, సిబ్బంది వ్యక్తిగత వివరాలు. వీటేశాడు సుమిత్ దొంగచాటుగా పాకిస్థాన్‌కు చేరవేశాడు. అంతటితో ఆగకుండా, తన పేరు మీద ఉన్న మొబైల్ నంబర్లతో పాక్ గూఢచారులు సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించుకోవడానికి కూడా సహకరించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు.

జైంట్ ఆపరేషన్.. చబువాలో ముగిసిన ఆట!

సుమిత్ కుమార్ కదలికలపై పక్కా ఆధారాలు సేకరించిన రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ బృందాలు అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లా చబువాలో సంయుక్త దాడి నిర్వహిస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైపూర్ కు. మార్చి 22న 1923 నాటి ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ (అధికార రహస్యాల చట్టం), 2023 బీఎన్‌ఎస్ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేయబడింది.

మరెంత మంది ఉన్నారు?

గూఢచారి నెట్‌వర్క్ కేవలం సుమిత్ కుమార్‌తో ముగిసిపోలేదని, దీని వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ మద్దతుతో ఈ విస్తృత నెట్‌వర్క్‌లో ఇతర లింక్‌లు, ఆపరేటివ్‌లను గుర్తించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. దేశ రక్షణలో కీలకమైన వాయుసేనలో ఇలాంటి చొరబాటు జరగడం భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.

[ad_2]

Source link