Friday, March 20, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? | అనుచరులతో సమావేశమైన తర్వాత బాలినేని తన తాజా...

మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక…!? | అనుచరులతో సమావేశమైన తర్వాత బాలినేని తన తాజా ట్వీట్‌ను తొలగించడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

బాలినేని జనసేనలో కొనసాగుతారా. తిరిగి వైసీపీ గూటికి చేరుతారా. ప్రస్తుతం బాలినేని నిర్ణయం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. జగన్ కు బంధువు అయిన బాలినేని వైసీపీని వీడి జనసేన లో చేరారు. అయితే, ఒంగోలు కేంద్రంగా రాజకీయాల్లోకి వస్తున్న బాలినేని ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తాజాగా తన కొడుకుతో కలిసి పవన్ తో సమావేశం అయ్యారు. అటు బాలినేని తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం వేళ.. బాలినేని చేసిన ట్వీట్ వైరల్ అయింది. అయితే, అంతలోనే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారంపై కొంత కాలంగా రాజకీ యంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా గుర్తింపు లేకపోవటంతో తాజాగా తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం.. బాలినేని ట్వీట్ తో స్పష్టత వచ్చినట్లు కనిపించింది. అయితే, అంతలోనే ఆ ట్వీట్ డిలీట్ చేసారు. 2024 ఎన్నికల తరువాత ఓటింగ్.. ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఆ తరువాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎంపీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలతో బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుచరులతో సమావేశమైన తర్వాత బాలినేని తన తాజా ట్వీట్‌ను తొలగించడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది.

అయితే, జనసేనలో చేరిన తరువాత స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే తో గ్యాప్ కొనసాగుతోంది. ఈ ఒంగోలులో బాలినేని వైసీపీ స్థానంలో ఇంచార్జ్ ను జగన్ నియమించారు. తాజాగా జరిగిన పార్టీ ఒంగోలు సమీక్షలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. అదే సమయంలో వాసన్నా మళ్లీ వస్తాడా అంటూ జగన్ ప్రశ్నించారు. దీంతో.. బాలినేని వైసీపీలోకి రీ ఎంట్రీ ఖాయమేనా అనే ప్రచారం మొదలైంది.

బాలినేని రాజకీయ నిర్ణయం ఏంటి..?

కాగా, ఈ సమయంలోనే తన కొడుకుతో కలిసి బాలినేని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఒంగోలులో పరిస్థితులను వివరించారు. ఆ తరువాత బాలినేని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తున్నానే ప్రచారం వేళ.. ఎక్కడా వైసీపీ పేరు ప్రస్తావన చేయకుండానే తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసారు.

అనుచరులతో సమావేశమైన తర్వాత బాలినేని తన తాజా ట్వీట్‌ను తొలగించడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది.

ఈ మేరకు బాలినేని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో పవన్ తో ఉన్న ఫొటోలను జత చేసిన బాలినేని..’ ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు… నమ్మకం, ఆదరణ, ఆశ్రయం..’ అని పేర్కొన్నారు. దీని ద్వారా తన కుమారుడితో కలిసి పవన్ ను కలవటం ద్వారా.. తనయుడికి రాజకీయంగా స్పష్టమైన హామీ పొందినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ తరువాత ఆ ట్వీట్ డిలీట్ చేసారు. సన్నిహితులు.. మద్దతుదారులతో బాలినేని చర్చలు ఉన్నాయి. రాజకీయంగా ఏం చేయబోతున్నారనే చర్చ ఆసక్తిగా మారుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular