అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
లూనార్ ఇయర్.. మనకు కొత్తగా అనిపించవచ్చు గానీ- పలు ఆసియా దేశాల్లో ఈ పండగను వైభవంగా జరుపుకొంటారు. చైనా, మలేసియా, జపాన్, థాయ్ లాండ్, తైవాన్, వియత్నాం, టికెట్, శ్రీలంక, సింగపూర్.. ఇలా పలు దేశాలు వేడుకలను నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి- చైనా. లూనార్ ఇయర్ నుంచే చైనాలో కొత్త సంవత్సరం ఆరంభమౌతుంది. వీధుల్లో ఎర్రటి దీపాలు, ఇళ్లకు కొత్త అలంకరణలు, తీపి వంటకాలు- ఇలా ఆసియాలోని అనేక బౌద్ధ దేశాల్లో చంద్రమాన నూతన సంవత్సర వేడుకలు నేడు ప్రారంభమయ్యాయి.
గ్రెగోరియన్ క్యాలెండర్‌కు భిన్నం. చంద్రుడి గమనం ఆధారంగా ఈ నూతన సంవత్సరం మొదలవుతుంది. బౌద్ధ సంప్రదాయాల్లో చంద్రునికి ప్రాముఖ్యత ఉంది, అనేక దేశాల్లో పండుగలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ పండుగ ఒక వారం నుండి 15 రోజుల పాటు జరిగే ఉత్సవం. లూనార్ ఇయర్.. సుమారు 354 రోజులు. సౌర సంవత్సరం 365 రోజులు కావడం వల్ల ఈ తేదీల్లో తేడా వస్తుంది. దీనివల్ల ముందుగానే సమయాల్లో మొదలవుతుంది.

లూనార్ ఇయర్‌ను చైనీస్ న్యూ ఇయర్ గా భావించారు లేదా.. అనేక బౌద్ధ దేశాలు దీన్ని జరుపుకొంటాయి. చైనా, తైవాన్లలో దీన్ని స్ప్రింగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు. డ్రాగన్ నృత్యాల కోలాహలం కనిపిస్తుంది ఎటు చూసినా. బౌద్ధాలయాల్లో ప్రజలు ధూపం వెలిగించి శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. థాయిలాండ్‌లో చైనీస్ థాయ్ కమ్యూనిటీ దీన్ని ఘనంగా నిర్వహిస్తుంది. బ్యాంకాక్ లోని చైనా టౌన్ స్ట్రీట్ ఫుడ్‌తో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. బౌద్ధ సన్యాసులకు ఎంతదానం ఇస్తారు.
శ్రీలంకలో ఈ పండుగ సింహాళీ, తమిళ నూతన సంవత్సరాలతో ముడిపడి ఉన్నా, లూనార్ ఉత్సవాల సంప్రదాయం ఇక్కడ పాతుకుపోయింది. ఆలయ పూజలు చేయడం, సాంప్రదాయ వంటకాలతో సహపంక్తి భోజనాలను నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. మయన్మార్‌లో నూతన సంవత్సరాన్ని ‘థిన్యాన్’ అని అంటారు. మన హోలీ తరహాలో మయన్మార్ లో రంగు నీళ్లు చల్లుకుంటారు. దీని ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుందని వారి నమ్మకం.
వియత్నాంలో దీనిని ‘టెట్’ అని పిలుస్తారు. ఆ దేశ ప్రజలకు అతిపెద్ద పండుగ ఇదే. పూర్వీకులను గౌరవించే పండుగగా భావిస్తారు. ఎక్కడ నివసిస్తోన్నా లేదా స్థానికులు తమ స్వస్థలాలకు చేరుకుంటారు. పూర్వీకులకు నివాళులర్పిస్తారు. చైనా తరహాలో పిల్లలకు ఎర్ర కవరులు బహుమతులను ఇవ్వడం ఇక్కడికి ఆనవాయితీ. బౌద్ధ తత్వశాస్త్రంలో ఇది ఆత్మపరిశీలన, ధ్యానం, దానం, కరుణ అభ్యాసాన్ని సూచిస్తుంది. ఈ లూనార్ ఇయర్ వల్ల చైనా సహా దాదాపు అన్ని ఆసియా దేశాల్లో మార్కెట్లు బంద్ అయ్యాయి. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసింది.

