అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏమాత్రం తగ్గేలా లేవు. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై వారం రోజులు దాటినా ఈ దేశాల్లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది. మార్చి 7 తెల్లవారుజామున ఇజ్రాయెల్ విస్తృత దాడులు చేపట్టారు. ఇరాన్, లెబనాన్ రాజధానులపై బాంబు దాడులు చేసింది. ఈ ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇరాన్ తో దాడుల వేళ సౌదీ అరేబియాలో పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కీలక పర్యటన. ఈ మేరకు సౌదీ అరేబియాకు వ్యూహాత్మక మద్దతు ఉంది. ఈ మేరకు సౌదీ రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్ తో అసిఎం మునీర్ కీలక భేటీ అయ్యారు. ఈ సమావేశం సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో జరిగింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఉద్ధృతం చేసిన వేళ పాకిస్థాన్- సౌదీ అరేబియా మధ్య ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో సౌదీపై ఇరాన్ జరిపిన దాడులపై చర్చించారు. దాడులకు ప్రతిగా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవాలన్నదానిపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ దాడులను నిలిపివేసి.. స్థానికంగా స్టెబిలిటీపై చర్చలు నిర్వహించినట్లు సౌదీ డిఫెన్స్ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ తో ఉన్న జాయింట్ స్ట్రాటెజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ లో భాగంగా ఇరాన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై చర్చించినట్లు వివరించారు. ఇరాన్ చర్యలు సౌదీ సరిహద్దుల్లో భయబ్రాంతులకు గురి చేశాయని అన్నారు.

ఈ మేరకు సౌదీ అరేబియాకు సపోర్ట్ ను ఇచ్చేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు అసిమ్ మునీర్ పేర్కొన్నట్లు సమాచారం. సౌదీకు రక్షణ, వ్యూహాత్మకంగా మద్ధతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపుతోంది. ప్రస్తుత మిడి ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతలు దక్షిణ- పాకిస్తాన్ మధ్య జైంట్ మిలిటరీ కో- ఆర్డినేషన్ అండ్ ఆపరేషనల్ ఫ్రేమ్ వర్క్స్ అవసరం అని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
ఇక పాకిస్తాన్- సౌదీ అరేబియా 2025 లో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం పాకిస్థాన్ పై సౌదీ అరేబియా పై దాడులకు పాల్పడితే ఇరు దేశాలపై దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్ నుంచి సౌదీలోని ఎంటీ క్వార్టర్ ఎడారి ప్రాంతంలోకి దూసుకొచ్చిన నాలుగు డ్రోన్ లను పేల్చేసినట్లు సౌదీ డిఫెన్స్ శాఖ.
మరోవైపు ఆఫ్గానిస్తాన్- పాకిస్థాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి ఈ యుద్ధాన్ని ఓపెన్ వార్ అని అభివర్ణించారు.