మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి
జగన్నాథ గట్టుపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
కర్నూలు క్రైమ్, ఆగస్టు 26, (సీమకిరణం న్యూస్):

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఆధ్వర్యంలో జగన్నాథ గట్టు సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వాహనదారులపై నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కర్నూలు తాలూకా పోలీసులు సూచించారు.