ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ కేబినెట్ భేటీలో అమరావతి సహా పలు కీలక అంశాలపై చర్చించారు. యుద్దం కారణంగా ఏర్పడిన పరిస్థితులు.. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై అధికారులు వివరించారు. ఇప్పటికే నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వేసవి వేళ కీలక నిర్ణయాల అమలు కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, మంత్రులకు ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది.
కేబినెట్ భేటీ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారిక అజెండా పూర్తి చేసిన తరువాత మంత్రులతో తాజా పరిస్థితుల పైన చర్చించారు. ఏప్రిల్ 1 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం నిర్వహించారు. భూగర్భ నీటిమట్టం పెంచాలని సూచించారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలన్నారు. ఇందుకు మంత్రులు రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. వెలుగొండ ఫేజ్ 1 ను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసినట్లు సీఎం చెప్పారు. కృష్ణా కరకట్ట కు బలహీనంగా ఉన్న ప్రాంతాలు పటిష్ట పరచాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 16 న అన్ని జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసారు. కాగా, యుద్ధం కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.

ఆరు సమయం… రిపోర్టులు నెలల సిద్దం
ఈ సబ్ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చం నాయుడు, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉంటారు. గ్యాస్ లేని పక్షంలో ఇండక్షన్ స్టవ్ లు కొంటున్నారని మంత్రి కేశవ్ చెప్పారు. అయితే, శాఖల్లో మంత్రులు, అధికారులు పై కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను ఏప్రిల్ 2 వ తేదీన ఇస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 సంవత్సరంలో పని తీరు రావాలని సూచించింది. ఈ నివేదికలో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధులు వినియోగం, అమలు వంటి అంశాలు రహస్య నివేదికలో ప్రణాళికలు రూపొందించబడ్డాయి. పంచాయతీ లు మాదిరిగా జలవనరుల శాఖ కూడా నీటి పన్ను వసూలు చేయాలి రామానాయుడుకు చెప్పిన సీఎం.. మంత్రులు చేసిన పనిని మీరు మీడియాకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని స్థిరత్వానికి తీసుకువచ్చా మని… ఇక ఇప్పుడు టేక్ ఆఫ్ చేయాలి అని చెప్పారు. అందరూ టెక్నాలజీని ఉపయోగించుకుంటే నిశ్చయించారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. అందరు సిద్ధంగా ఉండాలి అని చెప్పిన సీఎం..ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో గెలిచాం అని చెప్పారు. ఇక.. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి అని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
ఆంగ్ల సారాంశం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఎల్పీజీ సంక్షోభంపై మంత్రులకు సీఎం చంద్ర బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు