మంత్రాలయం ఔట్‌రీచ్ కార్యక్రమానికి మంత్రుల రాక
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 25 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మంత్రుల ఔట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు నగరంలోని స్థానిక ఎస్వీ రీజెన్సీకి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.