seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 3:20 am Digital Edition : SEEMA KIRANAM

మండుటెండల్లో తెలంగాణకు వరుణుడి హెచ్చరిక… మూడురోజులు వర్షాలు! | పెరుగుతున్న వేడి మధ్య తెలంగాణకు వర్ష హెచ్చరిక – శ్రీలంక తీరంలో అల్పపీడనం మూడు రోజులు వర్షాలు

[ad_1]

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణాలో ఒకపక్క ఈ నెలలోనే ఎండలు మండుతున్న తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన. శ్రీలంక సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే భారీ వర్షాలకు అవకాశం లేదు, కాంతి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.

ఈ రోజుల్లో కొన్ని జిల్లాలలో వర్షాలు

ఈ నెల 22, 23, 24 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. అయితే ప్రస్తుతం రాష్ట్రం నుంచి తేమ గాలులు అల్పపీడనం వైపు కదులుతుండడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి ఎండలు కూడా గతం కంటే ఎక్కువ అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంటున్నారు.

శ్రీలంక తీరంలో పెరుగుతున్న వేడి అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్షం హెచ్చరిక మూడు రోజులుగా కురుస్తుంది

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిన్న భద్రాచలంలో 1.1 డిగ్రీలు పెరిగి 36.2°Cగా నమోదైంది, ఖమ్మంలో 2.3 డిగ్రీలు పెరిగి 35.4°Cగా నమోదైంది. ఆదిలాబాద్‌లోనూ 1.6 డిగ్రీ పెరుగుదలతో 35.8°C ఉష్ణోగ్రత రికార్డు అయింది. మెదక్ మినహా తెలంగాణ వ్యాప్తంగా గాలిలో తేమ 35-42% మధ్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొందని అధికారులు.

అప్పుడే మొదలైన ఏసీలు, కూలర్ల వినియోగం

తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాల్సి ఉండగా, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే వేడి గాలులు, ఎండ తీవ్రత మొదలయ్యాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.

ఎండలకు జాగ్రత్త అంటున్న వైద్యులు

ప్రస్తుతం పెరుగుతున్న వేడి దృష్ట్యా వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. అత్యవసరమైతే కాటన్ దుస్తులు, టోపీ లేదా గొడుగు వాడాలి. డీహైడ్రేషన్ ప్రమాదం ఉన్నందున, తేలికపాటి ఆహారం, పండ్ల రసం తీసుకోవాలి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి, తరచుగా నీరు తాగి డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు.

[ad_2]

Source link