మంచి మనసున్న నాయకుడు రమేష్ శెట్టి.. గ్రామానికి అలాంటి నాయకుడే అవసరం!
మాజీ ఎంపీపీ, గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి
ఏబీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. ప్రజలకు అండగా ఉంటానని రమేష్ శెట్టి భరోసా
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22, (సీమకిరణం న్యూస్):

సేవా దృక్పథం, ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం కలిగిన నాయకుడు తిరువీధి రమేష్ శెట్టి అని మాజీ ఎంపీపీ, గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి కొనియాడారు. ఆదివారం వెల్దుర్తిలోని ఏబీఎం చర్చికి వెళ్లిన ఆయన, సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మన దశరథరామిరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంతంతో తమకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి మంచి మనస్తత్వం కలిగిన నాయకులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరువీధి రమేష్ శెట్టిని ఆదరించి, మద్దతు తెలపాలని కోరారు. అనంతరం తిరువీధి రమేష్ శెట్టి మాట్లాడుతూ, గ్రామ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం పాస్టర్ శశికుమార్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు బొమ్మన శ్రీకర్ రెడ్డి, బొమ్మన శ్రీధర్ రెడ్డి, తిరువీధి సుధీంద్ర, చర్చి సంఘ సభ్యులు పాల్గొన్నారు.