seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 3:09 pm Digital Edition : SEEMA KIRANAM

భార్య కోసం భిక్షాటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న న్యాయవాది రియల్ లైఫ్ స్టోరీ…! | తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది తన భార్య ఆరోగ్యం కోసం వేములవాడ ఆలయంలో వేడుకుంటున్న వాస్తవ వార్త వైరల్‌గా మారింది

తెలంగాణ

ఓయ్-కొరివి జయకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కోట్లకు అధిపతి అయిన వ్యక్తి తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి యాచకుడిగా మారిన కథ.. “బిచ్చగాడు” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అదే విధంగా నిజ జీవితంలోనూ ఒక భర్త తన భార్య ఆరోగ్యం కోసం అన్నీ వదిలేసి భిక్షాటనకు దిగిన ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హృదయాలను కలిచివేస్తోంది. భార్యను కాపాడుకోవడం కోసం భర్త ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. దీంతో ఈ ప్రముఖ న్యాయవాది రియల్ స్టోరీ అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..

పెద్దపల్లి జిల్లా మంథని స్థాపించిన కాసర్ల జలంధర్ రెడ్డి 2006లో రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్‌కు చెందిన శిరీషను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సాధారణ కుటుంబాల నుంచే వచ్చినా, పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా జీవనం సాగించారు. కరీంనగర్‌లో జలంధర్ రెడ్డి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా, శిరీష ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తోడ్పడేది. వారిద్దరికీ పిల్లలు లేకపోయినా.. ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమతో జీవనం సాగిస్తూ వచ్చారు.

తెలంగాణాలోని వేములవాడ దేవాలయంలో తన భార్య ఆరోగ్యం కోసం అడుక్కుంటున్న న్యాయవాది

కూలిపోయిన ఆర్థిక స్థితి..

అయితే కాలక్రమంలో శిరీష తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట చిన్న సమస్యగా భావించినా, అది క్రమంగా తీవ్రతరం కావడంతో చికిత్స కోసం దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. భార్యను కాపాడుకోవాలనే తపనతో జలంధర్ రెడ్డి తమ సంపాదనంతా ఖర్చు చేశారు. అప్పులు చేసి కూడా వైద్యం చేశారు. కానీ ఆశించిన ఫలితం కనిపించింది ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యారు.

భక్తితో కఠిన నిర్ణయం..

ఈ సమయంలో వేములవాడ రాజన్న ఆలయం సన్నిధిలో భిక్షాటన చేస్తే భార్య ఆరోగ్యం మెరుగుపడుతుందనే నమ్మకం జలంధర్ రెడ్డిలో బలపడింది. అందుకే భార్య ప్రాణాల కోసం తన వృత్తిని, గౌరవాన్ని పక్కనపెట్టి ఆలయ ప్రాంగణంలో యాచకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా చిన్న చిన్న మనస్పర్థలకే విడిపోతున్న ఈ కాలంలో, భార్య కోసం అన్నీ త్యజించి దేవుడి సన్నిధిలో జీవిస్తున్న భర్త కథ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

జలంధర్ రెడ్డి చేసిన త్యాగం, శిరీషపై ఉన్న ప్రేమ బంధానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. వారి కథ వినిన భక్తులు, స్థానికులు సహాయం అందిస్తూ దంపతులకు ధైర్యం చెబుతున్నారు. ఈ సంఘటన ప్రేమ, నమ్మకం, త్యాగం అనే విలువలు ఇంకా సమాజంలో ఉన్నాయని గుర్తు చేస్తోంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, నిజమైన ప్రేమ మనిషిని ఎంతటి నిర్ణయానికైనా తీసుకెళ్తుందనే సందేశాన్ని ఈ దంపతుల జీవితం అందిస్తోంది.

ఆంగ్ల సారాంశం

తన తల్లి ప్రాణాలను కాపాడేందుకు బిచ్చగాడిగా మారిన ఓ కోటీశ్వరుడి కథ “బిచ్చగాడు” సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నిజ జీవితంలో కూడా ఓ భర్త తన భార్య ఆరోగ్యం కోసం సర్వస్వం విడిచిపెట్టి వేడుకున్నాడు.

Source link