seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:25 pm Digital Edition : SEEMA KIRANAM

భారీగానున్నపెట్రోల్, డీజిల్ ధరలు ? | పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయా? 2000 కోట్ల రోజువారీ నష్టాన్ని ఎదుర్కొంటున్న చమురు కంపెనీలు! పూర్తి వివరాలు

వ్యాపారం

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావంతో భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కంపెనీలు రోజుకు దాదాపు రూ.200 కోట్ల చొప్పున నష్టపోతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు ఈ నష్టం?
గత 15 రోజుల్లోనే ముడిచమురు ధరలు 30 శాతం పెరిగాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. సిస్టమాటిక్స్ అనే బ్రోకరేజ్ సంస్థ రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం పెట్రోల్ విక్రయంపై కంపెనీలకు లీటరుకు రూ.20 మేర నష్టం వాటిల్లుతుండగా.. డీజిల్ మీద అత్యధికంగా లీటరుకు రూ.45 నష్టం వస్తోంది. రోజువారీగా జరుగుతున్న రూ.2000 కోట్ల నష్టంలో, సుమారు రూ.1650 కోట్లు డీజిల్ విక్రయాల వల్ల, రూ.350 కోట్లు పెట్రోల్ విక్రయాల వల్ల పెరుగుతున్నాయి. అంటే డీజిల్ అమ్మకం కంపెనీలకు మరింత భారీగా మారింది.

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతాయా రోజువారీ రూ. 2000 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్న చమురు కంపెనీలు పూర్తి వివరాలు

యుద్ధం, రవాణా ఛార్జీల ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చమురును రవాణా చేసే ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఫ్రైట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇప్పటివరకు తక్కువ ధరకు లభించిన రష్యన్ ముడిచమురు కూడా ఇప్పుడు ప్రీమియం ధరలకు లభిస్తున్న చమురు సంస్థలపై భారం రెట్టింపు అయ్యింది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
చమురు కంపెనీలు తమ సొంత నిధుల నుంచి ఈ నష్టాన్ని భరిస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచక తప్పని పరిస్థితి రావచ్చు. ఇది సామాన్యులపై ద్రవ్యోల్బణ భారాన్ని పెంచే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరా విషయానికి వస్తే.. ఖతార్ నుంచి సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం, అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరలు 50 శాతం పెరగడం వంటి పరిణామాలు కూడా భారత గ్యాస్ మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఆంగ్ల సారాంశం

భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయా? మిడిల్-ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు సంక్షోభం భారతీయ చమురు కంపెనీలకు భారీ నష్టాలకు దారి తీస్తుంది. పూర్తి నివేదికను చదవండి.

Source link