seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 6:23 am Digital Edition : SEEMA KIRANAM

భారత చరిత్రలోనే బాహుబలి డీల్..! 3.25 లక్షల కోట్లతో 114 రఫెల్స్..! | చారిత్రాత్మక ఆయుధ ఒప్పందం: భారతదేశం ₹3.25 లక్షల కోట్లకు 114 రాఫెల్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయనుంది.

3.25 లక్షల కోట్లతో మన దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కేంద్రం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.

భారతదేశం

-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తమ రక్షణ పరంగా ఎదురైన సవాళ్ల నేపథ్యంలో భారత్ (india) చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగ కొనుగోలుకు సిద్ధమైంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న యుద్ద విమానాలకు తోడు భారీ ఎత్తున కొత్త యుద్ద విమానాలను తమ అమ్ములపొదిలోకి చేర్చుకునేందుకు వీలుగా కీలక ఒప్పందం కుదుర్చుకోబోతోంది. దీన్ని చరిత్రలోనే బాహుబలి డీల్ గా రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ డీల్ భారత రక్షణ రంగానికి మేలి మలుపు కాబోతోంది.

బాహుబలి డీల్ (భారతదేశం)

భారత వైమానిక దళం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ల కొ నుగోలు కోసం ఫ్రాన్స్‌తో ఏకంగా రూ.3.25 లక్షల కోట్ల ఖర్చుతో 114 ఫ్రెంచ్ రఫెల్ (రాఫెల్ ఫైటర్ జెట్‌లు) యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్దమవుతోంది. ఈ ఒప్పందానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారం ఆమోదం తెలపబోతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఢిల్లీ పర్యటన వేళ ఈ ఒప్పందం జరగబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ఆమోదం పొందితే, దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా నిలవబోతోంది.

3 25 లక్షల కోట్లతో 114 రాఫెల్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయనున్న భారత్ చారిత్రాత్మక ఆయుధాల ఒప్పందం

3.25 లక్షల కోట్లతో 114 విమానాలు

ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే మొత్తం 114 రాఫెల్ యుద్ధ విమానాల్లో సుమారు 100 విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసేలా షరతు పెడుతున్నారు. దీంతో అత్యాధునిక ఫైటర్ జెట్లను, దేశీయంగా తయారు చేసి ఇచ్చేలా ఒప్పందం జరగనుంది. అలాగే ఫ్రాన్స్ యేతర దేశాలలో రాఫెల్ విమానాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలవనుంది. రెండు ఇంజిన్లతో కూడిన, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బహుళార్ధసాధక యుద్ధ విమానం రఫెల్. కచ్చితమైన దాడులు చేయడంలో రఫేల్ కు మంచి రికార్డు ఉంది.

3 25 లక్షల కోట్లతో 114 రాఫెల్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయనున్న భారత్ చారిత్రాత్మక ఆయుధాల ఒప్పందం

ఇప్పటికే మన అమ్ములపొదిలో..

ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పటికే 36 రాఫెల్ విమానాలు ఉన్నాయి. ఇందులో చివరిదశైన సీ వేరియంట్ 2024 డిసెంబర్ లో ఫ్రాన్స్ మనకు ఇచ్చింది. అప్పట్లో రూ.63,000 కోట్ల ఒప్పందం కింద నేవీ కోసం 26 ‘ఎం’ వెర్షన్ రాఫెల్ విమానాలకు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఈ డీల్‌లో నాలుగు రెండు-సీట్ల శిక్షణ విమానాలు, అలాగే MRO (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) ఒప్పందం కింద విమానాల నిర్వహణ, లాజిస్టిక్స్, సిబ్బంది శిక్షణ ఉన్నాయి. వీటి డెలివరీ 2030కు జరగనుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న రఫేల్ విమానాలను చివరి సారిగా ఆపరేషన్ సింధూర్ లో వాడారు.

ఆంగ్ల సారాంశం

మేక్ ఇన్ ఇండియా, డొమెస్టిక్ అసెంబ్లీ మరియు ఫ్రాన్స్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాలను నొక్కి చెబుతూ 114 రాఫెల్ మల్టీ రోల్ ఫైటర్ డీల్‌కు సంభావ్య ఆమోదాన్ని ఈ కథనం నివేదించింది.

Source link