seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 6:08 am Digital Edition : SEEMA KIRANAM

భారత్ లో ఆ మారణహోమం.. పాకిస్థాన్ పనే: కొత్తగా మహిళా ఉగ్రవాదులు: ఐరాస తాజా రిపోర్ట్ | ఎర్రకోట దాడి జైష్-ఎ-మహ్మద్‌తో ముడిపడి ఉంది మరియు కొత్త మహిళా విభాగంతో విస్తరిస్తున్నట్లు UNSC నివేదిక పేర్కొంది

అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

గత ఏడాది నవంబర్ లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో సంభవించిన కారుబాంబు పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో 15 మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక వెలుగులోకి వచ్చింది. భద్రతా మండలికి పంపిన నివేదిక ఇది. ఈ కారుబాంబు పేలుడు వెనుక పాకిస్తాన్ ప్రోత్సాహిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉంది ఇందులో పొందింది ఐక్యరాజ్యసమితి. కారు బాంబుతో సహా అనేక దాడులకు బాధ్యత వహించినట్లు లిఖితపూరకంగా తెలియజేసింది. నవంబర్ 9న రెడ్ ఫోర్ట్ పై జరిగిన దాడి కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది.

ఎర్రకోట దాడి జైష్-ఎ-మహ్మద్‌తో ముడిపడి ఉంది మరియు కొత్త మహిళా విభాగంతో విస్తరించిందని UNSC నివేదిక పేర్కొంది

అంతకుముందు- అక్టోబర్ 8న జైషే మహ్మద్ నాయకుడు మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అధికారికంగా మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారని. జైషేలో భాగంగా మహిళా విభాగం జమాత్ ఉల్-ముమినత్ ను అధికారికంగా ప్రకటించారని, ఇది ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని ఐరాస నిర్ధారించింది. మహిళా విభాగం విస్తరణ కోసం భారీగా రిక్రూట్‌మెంట్లు చేపట్టేందుకు ఐరాస అభిప్రాయపడింది. అది- అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పును రెట్టింపు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

దీనితో పాటు- ఇరాక్, లెవెంట్ (డాయిష్)లోని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వాటికి సంబంధించిన వ్యక్తులు, గ్రూపులు, సంస్థలపై దృష్టి సారించిన పలు తీర్మానాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఆఫ్ఘానిస్తాన్‌లో ఇతర సాయుధ వర్గాలతో పొత్తుల కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవెంట్-ఖొరాసన్ (ISIL-K) ప్రయత్నాలు ప్రారంభించారు.

చాలాకాలంగా ఈ సంస్థ ఆఫ్ఘానిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలోని బదఖాన్ రీజియన్, అలాగే పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో పనిచేస్తుంది. తన స్లీపర్ సెల్స్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇది ఆ రీజియన్లకు మాత్రమే పరిమితం కావట్లేదు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించిందని ఐరాస నివేదిక. గాజా, ఇజ్రాయెల్ వంటి సంక్షోభాల్లో జోక్యం చేసుకోవడం, కొత్త రిక్రూట్‌మెంట్లు, నిధుల సేకరణకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించబడింది.

బలోచ్ లిబరేషన్ ఆర్మీ టీటీపీ (TTP), ఐఎస్‌ఐఎల్-కే మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదని ఐరాస అంచనా వేసింది. ఈ రెండు జాయింట్ గా ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహించడం, తమ వనరులను పరస్పరం పంచుకోవడం, దాడులను సమన్వయం చేసుకోవడం, కమాండర్ల సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు తరచూ సాగిస్తోన్నాయని ఐరాస ప్రారంభించారు. ఇరాన్‌లోని షియాలోని ప్రార్థనాపై దాడి చేయాలనే లక్ష్యాలు కూడా ఉన్నాయి.

ఆంగ్ల సారాంశం

UNSC ఆంక్షల పర్యవేక్షణ బృందం జైష్-ఎ-మొహమ్మద్‌తో లింక్ చేసిన ఎర్రకోట దాడి నవంబర్ 10న న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ జైషే ఇ ముహమ్మద్ పాత్రను మరియు జైష్‌కి చెందిన మసూద్ అజర్ ఇప్పుడు టెర్రర్ గ్రూప్‌లో మహిళా విభాగాన్ని ఎలా ఏర్పాటు చేసాడో ఫ్లాగ్ చేసింది. తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక వెలుగులోకి వచ్చింది. భద్రతా మండలికి పంపిన నివేదిక ఇది.

Source link