Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణభారత్ కు బంగ్లా కొత్త తలనొప్పి ? తేడా వస్తే సీన్ రివర్స్..! | ప్రధాన...

భారత్ కు బంగ్లా కొత్త తలనొప్పి ? తేడా వస్తే సీన్ రివర్స్..! | ప్రధాన దౌత్య పరీక్ష: తారిక్ రెహమాన్ విజయం తర్వాత బంగ్లాదేశ్ నుండి భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది

📰 Generate e-Paper Clip


బంగ్లాదేశ్ లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం భారత్ కు పలు సవాళ్లు విసురుతోంది. సున్నితమైన ఈ సవాళ్లను పరిష్కరించడంలో భారత్ విఫలమైతే బంగ్లాదేశ్ .. చైనా, పాకిస్తాన్‌లతో కలిసి కూటమి ఏర్పాటు చేయడం ఖాయం.

అంతర్జాతీయ

-సయ్యద్ అహ్మద్

బంగ్లాదేశ్ (బంగ్లాదేశ్) లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ నుండి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. మొత్తం 300 సీట్లు ఉన్న పార్లమెంట్ లో 299 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఏకంగా 210 సీట్లు గెల్చుకుని సంచలనం సృష్టించింది. దీంతో భారత ప్రధాని నరేంద్రమోడీ .. కాబోయే బంగ్లా ప్రధాని తారిఖ్ రహ్మాన్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఈ పరిణామం భారత్ కోణంలో చాలా కీలకంగా మారనుంది.

70వ దశకంలో పాకిస్థాన్ పై యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన భారత్ (ఇండియా) ఇప్పుడు అదే నుంచి కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల నుంచీ షేక్ హసీనా వరకూ అన్నీ సమస్యలే. కొన్నేళ్లుగా భారత్ లోకి బంగ్లాదేశ్ వలసలు పెరుగుతున్నాయి. వీటిని మోడీ సర్కార్ తో పాటు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు కూడా కఠినంగా అణచివేస్తున్నాయి. అలాగే వీటిని బూచిగా చూపుతూ ఎన్నికల్లోనూ గెలుస్తున్నాయి. అలాగే భారత్ వరకూ సానుకూలంగా ఉండే ప్రధాని షేక్ హసీనా అధికారంలో ఉండేవారు. కానీ ప్రస్తుతంగా ఈ సీన్ రివర్స్ అయింది.

తారిక్ రెహ్మాన్ విజయం తర్వాత బంగ్లాదేశ్ నుండి ప్రధాన దౌత్య పరీక్ష భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది

బంగ్లాదేశ్‌లో భారత్ అనుకూల హసీనా ప్రభుత్వాన్ని ప్రజా తిరుగుబాటుతో గద్దె దింపిన తర్వాత అక్కడ హిందువులపై దాడులు పెరిగాయి. ఇవి హత్యల వరకూ వెళ్లాయి.దీనిపై భారత్ తమ నిరసన తెలుపుతూనే ఉంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన మాజీ షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఈ రెండు అంశాలు ఇప్పుడు ఇరుదేశాల సంబంధాలకూ తూట్లు పొడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారత్ అంటేనే మండిపడే బీఎన్పీ అధికారంలోకి వస్తోంది.

ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తారిఖ్ రెహ్మాన్ హసీనా అప్పగింత విషయంలో భారత్ పై ఒత్తిడి తీసుకురాకపోతే అక్కడ మనుగడ సాధించడం కష్టం. అలాగని భారత్ ఆమెను బంగ్లాదేశ్ కి తిరిగి అప్పగించే పరిస్థితి లేదు. అలాగే గతంలో బీఎన్పీలో అధికారంలో ఉండగా.. భారత్ వ్యతిరేక తీవ్రవాదులు అక్కడి నుంచి దాడులకు వ్యూహాలు రచించేవారు. ఇప్పుడు తిరిగి బీఎన్పీ అధికారంలోకి వచ్చినా, అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న అతివాద జమతే ఇస్లామీ విపక్షంలో ఉండటం కాస్త ఊరట.

తారిక్ రెహ్మాన్ విజయం తర్వాత బంగ్లాదేశ్ నుండి ప్రధాన దౌత్య పరీక్ష భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది

అలాగే బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వస్త్రాలు, ఇంధన రంగాల్లో ఇరుదేశాల బంధం కొనసాగుతోంది. స్థిరత్వం. దీన్ని భారత్ తప్పక కొనసాగించాల్సిన పరిస్థితి. అలాగే అస్సాం, మేఘాలయ, త్రిపురలను సిల్హెట్, ఢాకాతో కలిపే కనెక్టివిటీ ప్రాజెక్టులను భారత్ కొనసాగించాల్సి ఉంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని భారత్ వ్యతిరేక సెంటిమెంట్‌ను మోడీ సర్కార్ సున్నితంగా పరిష్కరించాల్సి ఉంది. అలాగే వలసల సమస్యపై దూకుడు తగ్గించాలి. అన్నీ భారత్ చేయగలిగితేనే బంగ్లాదేశ్‌తో సంబంధాలు కొనసాగుతాయి. లేకపోతే పాకిస్థాన్, చైనాతో కలిసి బంగ్లాదేశ్.. భారత్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసుకోవడం ఖాయం.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular