seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 3:21 am Digital Edition : SEEMA KIRANAM

భారత్‌తో ఇరాన్ సుప్రీం లీడర్ “ఖమేనీ”కి ఉన్న ప్రత్యేక సంబంధం ఇదే !! | ఇరాన్ సుప్రీం లీడర్ “ఖమేనీ”కి భారతదేశంతో ఉన్న ప్రత్యేక సంబంధం మరియు ఆసక్తికరమైన వివరాలు ఇది

అంతర్జాతీయ

ఓయ్-కొరివి జయకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ సర్వాధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. 198లో సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, ఇరాన్‌లో అత్యున్నత అధికారిగా వ్యవహరించారు. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించారు. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించారు.

ఖమేనీ కుటుంబ మూలాలు భారత్‌లోనే?

కాగా ఖమేనీ కుటుంబ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా కింతూర్ గ్రామానికి చెందినవని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 19వ శతాబ్దంలో భారతదేశంలో జన్మించారు, తరువాత ఇరాక్‌లోని నజాఫ్‌కు వలస వెళ్లినట్లు గుర్తించారు. ఇరాన్ అధికారిక పత్రాల్లో ‘హిందీ’ అనే పదాన్ని తన పేరుతో కొనసాగించడం ద్వారా ఖమేనీ తన భారత మూలాలను గుర్తుచేసుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. ఈ అంశం భారత్‌లోని కొన్ని భాగాలకు ప్రత్యేకమైన గౌరవాన్ని అందించింది.

ఇరాన్-సుప్రీం-లీడర్-ఖమేనీ-భారతదేశంతో-ఇదే-ప్రత్యేక-సంబంధం-

‘మినీ ఇరాన్’గా అలీపుర్ ??

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా అలీపుర్ గ్రామంలో దాదాపు 90 శాతం మంది షియా ముస్లింలే రూపొందించారు. ఇరాన్‌తో ఈ పాఠశాల దశాబ్దాలుగా ఉన్న సాంస్కృతిక, మత సంబంధాల కారణంగా దీనిని స్థానికంగా ‘మినీ ఇరాన్’గా పిలుస్తారు. గ్రామంలోని అనేక కుటుంబాలకు ఇరాన్‌తో ప్రత్యక్ష అనుబంధాలు ఉన్నాయి. కొంతమంది విద్య, ఉపాధి కోసం ఇరాన్, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరపడ్డారు. ఖమేనీ మరణంతో ఈ గ్రామంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఖమేనీ భారత్ పర్యటన..

1986లో ఖమేనీ భారత్‌ను సందర్శించిన సమయంలో అలీపూర్ గ్రామానికీ విచ్చేశారు. ఆ సందర్శన సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై మతపరమైన, సామాజిక అంశాల ప్రసంగించారు. అనంతరం ఇరాన్ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో ఒక ఆసుపత్రిని స్థాపించారు. ఆసుపత్రి ఇప్పటికీ ఇరాన్‌కు చెందిన ఏజెన్సీల ఆర్థిక సహకారంతోనే నడుస్తుండటం విశేషం. గ్రామ ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించబడతాయి ఈ ఆసుపత్రి, ఖమేనీతో గ్రామానికి ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.

చిక్కబళ్లాపుర ప్రాంతం నుంచే సుమారు 150 మంది విద్యార్థులు దుబాయ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్, పశ్చిమాసియా దేశాలతో విద్యా సంబంధాలు కొనసాగడం వల్ల ఈ అంతర్జాతీయ అనుబంధం పెరిగింది. ఖమేనీ మరణంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు కూడా సంతాప సందేశాలు పంపినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఇక ఇప్పటికే ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిరసనలు, సంతాప సూచనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దేశాల్లో అమెరికా వ్యతిరేక ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి.

ఆంగ్ల సారాంశం

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సైనిక దాడుల నేపథ్యంలో ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.

Source link