seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:38 am Digital Edition : SEEMA KIRANAM

బ్రాండెడ్ పేరుతో జనరిక్ మందుల అమ్మకాలు..

బ్రాండెడ్ పేరుతో జనరిక్ మందుల అమ్మకాలు..

 

మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా..!!

 

షాద్ నగర్, జూలై 01, (సీమకిరణం న్యూస్):

 

మెడికల్ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు కొనసాగిస్తూ, కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న మెడికల్స్ దాదాపు 500 పైనే ఉండగా ,మిగతా కొన్ని మెడికల్స్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. కొందరు మెడికల్ యజమానులైతే పేదల అవసరం అసరా చేసుకుని ప్రిస్క్రిప్షన్ లేకుండానే డాక్టర్లలా సలహాలు ఇస్తూ, అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్కిప్షన్ కూడా అవసరం లేకుండా మెడికల్ మందులు విక్రయిస్తున్నా వారిపై అధికారులు నిఘా పెంచడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి మెడికల్ షాపుల నిర్వహణను ఎక్కడ పాటించడం లేదని పలువురు ప్రజలు వాపోతున్నారు.

 

అద్దె సర్టిఫికెట్లతోనే మెడికల్ నిర్వహణ..

 

మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. అడ్డదారిన అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా మెడికల్ దందాను నిర్వహిస్తు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లైసెన్స్ ఒకరిది వుండి నిర్వహణ మాత్రం మరొకరిది అన్నట్టు వుంది పరిస్థితి. ఔషధ నియంత్రణ విభాగం అధికారులు చర్యలు తీసుకోక, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.మెడికల్ షాప్ లో బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు లేక, చాలా వరకు సంబంధిత కోర్సు చేసిన వారి సర్టిఫికెట్లు అద్దెకు తెచ్చుకుని లైసెన్స్ తీసుకొని మరి మెడికల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు..!!