seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 4:29 am Digital Edition : SEEMA KIRANAM

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక స్టాండప్ కమెడియన్ : మంత్రి TG భరత్

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక స్టాండప్ కమెడియన్.. 45 కోట్ల ఆరోపణల పై మంత్రి TG భరత్ ఫైర్…..

 

రాజ‌కీయాల్లో మచ్చలేనిది టీజీ కుటుంబం

 

 

ప్ర‌త్య‌ర్థుల‌కు కూడా టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో తెలుసు

 

 

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జోక‌ర్‌లా మారి అస‌త్యాలు మాట్లాడుతున్నారు

 

 

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్‌ కేసు వేయ‌బోతున్నాను

 

 

అవినీతి మ‌ర‌క లేకుండా ప్ర‌జాసేవ చేస్తున్నాం

 

 

సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో క‌ర్నూలు అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డుతున్నా

 

 

మీడియా స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

 

 

కర్నూలు ప్రతినిధి, మే 14, (సీమకిరణం న్యూస్):

 

 

ద‌శాబ్దాలుగా నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నామ‌ని, రాజ‌కీయాల్లో టీజీ కుటుంబం అంటే మ‌చ్చ‌లేనిద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. అమరావ‌తిలోని స‌చివాల‌యంలో ప‌బ్లిసిటీ సెల్‌లో మంత్రి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌న తండ్రి టీజీ వెంక‌టేష్‌ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుండి నిజాయితీగా ప్ర‌జాసేవలో ఉన్నార‌ని, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా అదేబాట‌లో న‌డిచార‌న్నారు. ఆయ‌న్ను చూసి తాను కూడా ప్ర‌జాసేవ‌లోకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఏదో రాజ‌కీయం చేయాల‌న్న కార‌ణంతో బైరెడ్డి సిద్ధార్ద రెడ్డి క‌ర్నూల్లో త‌న గురించి ఇష్టానుసారం మాట్లాడార‌ని మండిప‌డ్డారు. తన‌కు అవినీతి చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కోట్ల రూపాయ‌లు దోచుకున్నానంటూ త‌న‌పై బైరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్ కేసు వేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. నిజాయితీప‌రుడైన టీజీ భ‌ర‌త్ విష‌యంలో ఎందుకు మాట్లాడానా అని బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి త‌ప్ప‌కుండా ఆలోచించే రోజు వ‌స్తుంద‌ని మంత్రి చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు డైరెక్ష‌న్‌లో రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు అహ‌ర్నిష‌లు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు. క‌ర్నూలును అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నానని టీజీ భ‌ర‌త్ అన్నారు. సైలెంట్‌గా డెవ‌ల‌ప్మెంట్ పై ఫోక‌స్ పెట్టిన మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేద‌ని మండిప‌డ్డారు. ఏదో వాళ్ల పేప‌ర్లో హైలెట్ అవుదామ‌ని బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి జోక‌ర్ అవ‌తారం ఎత్తార‌న్నారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు సైతం టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో స్ప‌ష్టంగా తెలుస‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సైతం త‌మ‌ను ఉద్దేశించి ఎవ్వ‌రూ అవినీతి చేశార‌ని చెప్పిన సంద‌ర్భాలు లేవ‌న్నారు. బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి కేవ‌లం మాట్లాడడానికే తప్ప ఎందుకూ ప‌నికారాడ‌న్నారు. అది తెలుసు కాబ‌ట్టే ఆ పార్టీ ఆయ‌న‌కు టికెట్ కూడా ఇవ్వ‌లేద‌న్నారు. ఆయ‌న‌కు చేత‌నైతే 2029 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని త‌న‌పై పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. దిగ‌జారిపోయి రాజ‌కీయాలు చేయ‌డం వైసీపీ నాయ‌కుల‌కే చెల్లుతుంద‌న్నారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ఇంత‌వ‌ర‌కు సరైన వ్య‌క్తి త‌గ‌ల‌లేద‌న్నారు. తన‌పై అన‌వ‌స‌ర నింద‌లు వేసిన బైరెడ్డి త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌న్నారు. మంత్రి స్థాయిలో తాను అభివృద్ధి గురించి త‌ప్ప ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తూ ఎప్పుడు రాజ‌కీయాలు చేయ‌లేద‌న్నారు. త‌మ పార్టీ అధినేత చూపిన క్ర‌మ‌శిక్ష‌ణ బాట‌లోనే న‌డుస్తున్నామ‌న్నారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై క్రిమిన‌ల్, సివిల్ డిఫ‌మేష‌న్ కేసులు వేస్తాన‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు.