ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్రయాణికుల అదనపు రద్దీని రైల్వే అధికారులు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొన్నటి హోలీ పండగ నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు యశ్వంత్‌పూర్ – కతిహార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను విడుదల చేశారు.
ఈ రెండు స్టేషన్ల మధ్య మొత్తం ఎనిమిది రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అవన్నీ కూడా ఏపీ మీదుగా రాకపోకలు సాగించేవే. తొలి రైలు ఈ నెల 10వ తేదీన పట్టాలెక్కనుంది. ఈ నెల చివరి వరకూ అంటే మార్చి 31వ తేదీ వరకు రాకపోకలు సాగుతాయి. ఆ తర్వాత ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను మరి కొన్ని రోజుల వరకు పొడిగించే అవకాశాలను రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ నెల 10 నుండి 31వ తేదీ వరకు ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకు యశ్వంత్ పూర్ నుండి బయలుదేరే నంబర్ 06571 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 4: 30 గంటలకు కతిహార్ కు చేరుకుంటుంది.
ఈ నెల 13 నుండి 31వ తేదీ వరకు ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు కతిహార్ నుండి బయలుదేరే నంబర్ 06572 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 4 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది.
యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపురం, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖల్‌పూర్ శాంతినికేతన్, రాంపూర్ హాట్, పాకూర్, మాల్దా టౌన్, సంసి, కుమెద్‌పూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగుతాయి.

