అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. రెండు వారాల పాటు యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, గ్యాస్ రిఫైనరీ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాలోని ఇంధన లక్ష్యాలే కేంద్రంగా దాడులకు తెగబడుతున్నాయి.
ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. రెండు వారాలుగా యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్ మరోసారి సౌదీ అరేబియాపై దాడులకు దిగింది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్ కో రిఫైనరీపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఈ ఆయిల్ రిఫైనరీ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ దాడుల్లో రిఫైనరీ ధ్వంసం అయినట్లు సంబంధిత వర్గాలు ఉన్నాయి.
మరోవైపు ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయంగా ఎర్రసముద్రం ద్వారా చమురును రవాణా చేస్తోంది. ఇరాన్ కు చెందిన ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులు జరుగుతున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడికి ముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లోని ఇంధన కేంద్రాలను ఖాళీగా ఉంచడానికి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఇక సౌదీలోని పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

ఇరాన్ ఇలిజెన్స్ మంత్రి ఇస్మా కతీబ్ అలాగే లారిజానీ మరణాలకు ప్రతీకారంగా ఆ దేశం ఈ దాడులను ప్రారంభించినట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణులతో దాడులకు పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. ఈ దాడిలో భారీ స్థాయిలో ఈ ప్రాంతం దెబ్బతింది.