బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం
బాల్య వివాహం నిర్మూలిద్దాం
ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి
వెల్దుర్తి, ఫిబ్రవరి 05, (సీమకిరణం న్యూస్):

బాల్య వివాహ రహిత జిల్లాగా కర్నూలు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐసీడీఎస్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో గురువారం సచివాలయం 2 పరిధిలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో శారద & శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు టీచర్స్ బాల్య వివాహం100 రోజుల్లో బాల్య వివాహం రహిత లేని ఆంధ్రప్రదేశ్ నీ తీర్చుదాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఎం ఎస్ కె సిరాజ్ మాట్లాడుతూ ఆడపిల్లలకు సమాజంలో ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఎలా ప్రవర్తించాలి వివిధ సమస్యలకు గురించి బాలికలకు తెలియజేశారు. సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ బాలికలకి ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేసింది చట్టాలపై అవగాహన చేసుకోవాలని ముఖ్యంగా బాల్య వివాహాల చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. మీ ప్రాంతంలో ఎక్కడ జరిగిన మాకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పట్టణం అంగనవాడి కేంద్రం వర్కర్స్ 12 మంది పాల్గొన్నారు ప్రవేట్ స్కూల్ పిల్లలు టీచర్స్ మొదలగువారు పాల్గొన్నారు.