భారతదేశం
-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అనేక రంగాల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చమురు ఉత్పత్తుల పైన ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది. ఇలా ఉంటే యుద్ధ పరిస్థితులు వంటనూనెల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజాగా పెరిగిన ధరలతో తెలుస్తోంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రజల దైనందిన జీవితం పైన భారం మోపుతోంది. పెరిగిన ధరలతో సామాన్య మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.
వంట సరఫరాపైన పడిన ప్రభావం నూనె
యుద్ధ పరిస్థితులతో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. లీటరుకు పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు వంట నూనెల ధరలు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. సరఫరాలో అంతరాయాలు దిగిన సరుకు రవాణా ధరలు ఇరాన్ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న భయాందోళనల కారణంగా వంట నూనె సరఫరాపై పడిన ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైంది.

హార్ముజ్ జలసంధిని గుర్తించడమే ధరల పెరుగుదలకు కారణం
హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ తీవ్రంగా ప్రభావితమైంది. దీనివల్ల పొద్దుతిరుగుడు, సోయా నూనెల సరఫరాలో జాప్యం జరుగుతుంది. యుద్ధం కొనసాగితే మరింతగా ధరలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలకు ముఖ్యంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని అంగీకరించడమే కారణమని. మన దేశానికి కావాల్సిన వంట నూనె ముడిసరుకు జలమార్గం ద్వారానే చేరుతుండగా, యుద్ధానికి ముందే ధరలు రూ.120 నుండి రూ.140-150కి చేరాయి.
ప్రస్తుతం వంట నూనెల ధరలు ఇలా
ప్రస్తుతం లీటరు ప్యాకెట్ వంట నూనె ధర 170 రూపాయలు కాగా, అదనంగా 10 రూపాయలు కలిపి 180 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనె ధరలు పెరిగాయి, కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇక ఈ పరిస్థితులు ఇలా ఉంటే సామాన్యులు కనీసం తిండి కూడా తినలేని పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజలపైన ఆర్థిక భారం
ఏది ఏమైనా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై పడుతుంది. అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రజల దినసరి ఖర్చు పెరుగుతున్న ధరలతో బాగా పెరిగిపోయింది.
ఆంగ్ల సారాంశం
ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో వంట నూనెల ధరలు పెరిగాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిత్యావసర ధరలతో సామాన్యులు సంక్షోభంలో పడ్డారు. హార్ముజ్ జలసంధిని మూసివేయడమే ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం.