seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 5:37 am Digital Edition : SEEMA KIRANAM

బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ 1500 పథకం, ఉద్యోగులకు పీఆర్సీ..!? | 2026-27 బడ్జెట్‌లో అభివృద్ధి- సంక్షేమానికి ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

AP బడ్జెట్ 2026-27: మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు అందించిన ఆర్థిక శాఖ. వీటికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ప్రత్యేకంగా సమావేశమైన కేబినెట్ బడ్జెట్ ఆమోదం. ఈ సారి బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు. అదే విధంగా మహిళలు.

ఏపీ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ను ప్రతిపాదించేందుకు సిద్దమైంది. దాదాపు రూ 3.48 లక్షల కోట్ల ప్రతిపాదనలతో బడ్జెట్ సిద్దమైనట్లు ఉన్నాయి. ఈ సారి బడ్జెట్ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించినట్లు సమాచారం. అదే విధంగా ఉద్యోగుల పీఆర్సీ పైన స్పష్టత ఇవ్వనున్నాయి. బడ్జెట్ ప్రతులను అధికారులు మంత్రి కేశవ్ కు అందచేశారు.

2026-27 బడ్జెట్‌లో అభివృద్ధి- సంక్షేమానికి ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యత ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

బడ్జెట్ ప్రతులతో వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్న మంత్రి.. అక్కడ మరోసారి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అక్కడి నుంచి సచివాలయానికి బయలుదేరారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మరోసారి పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరగనున్న కేబినెట్ సమావేశానికి పద్దు ప్రతులతో హాజరుకానున్నారు.

హామీల అమలుకు ప్రాధాన్యత

ఈసారి వార్షిక బడ్జెట్ సుమారుగా రు.3.48 లక్షల కోట్ల నుండి 3.50 లక్షల కోట్ల రూపాయలకు అటు, ఇటుగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం నేడు (శనివారం) ఉభయసభలలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో మెజార్టీ నిధులు రావడానికి వ్యయానికే ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమానికి నిధుల కొరత లేకుండా చూడాలని, అదే సమయంలో అభివృద్ధి పనులకు అవకాశం ఉండేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని దిశా నిర్దేశంతో ఆ ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

గత ఏడాది 3.22 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రతిపాదికంగా, ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో దీనిని 3,31,166 కోట్లుగా సవరించారు. ఇంత భారీగా ఆమోదం పొందిన ప్రతిపాదనల్లో 80 శాతం కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సమాచారం. ఆదాయం కూడా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన స్థాయిలో రాకపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడం వంటి కారణాలతో ఖజానా తీవ్ర కుదుపులకు గురైంది. దీనితో.. ఈ సారి ప్రతిపాదనల పైన ఆసక్తి.

ఆంగ్ల సారాంశం

ఈరోజు అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను సమర్పించనున్న ఏపీ ప్రభుత్వం, వచ్చే ఏడాది ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

Source link