తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణ ప్రభుత్వం మహిళలు.. ఉద్యోగులు.. విద్యార్ధుల కోసం కొత్త నిర్ణయాలు ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మరి కాసేపట్లో అసెంబ్లీ ముందు ఉంచనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ రూ.3.35 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
రేవతి నక్షత్రం, అభిజిత్ లగ్నం ముహూర్తం ఈ మధ్యాహ్నం ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు కాగా… దీనికి మరో 10 శాతం మేర పెంచి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్‌ను ఆమోదించడానికి రాష్ట్ర క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశం. ఎన్నికల పెండింగ్ హామీల ను ఈ బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1,00,116లతో పాటు తులం బంగారం ఇస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

తులం బంగారానికి బదులు కల్యాణ లక్ష్మి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1,00,116లకుమరో రూ.50 వేలు కలిపి రూ.1,50,116 బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది. అదే విధంగా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య వసతి(ఈహెచ్‌ఎస్) ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల మూల వేతనాల నుంచి 1.5 శాతం చొప్పున ప్రతి నెలా మినహాయించి, ఈహెచ్‌ఎస్ కార్పస్ ఫండ్‌లో కలుపుతారు. ఇలా మొత్తం రూ.528 కోట్లు జమ కానున్నాయి. ఇంత మొత్తం రూ.528 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలున్నాయి.
పెన్షన్లు విడతల వారి పెంపు.. విద్యా శాఖకు భారీ కేటాయింపులు
ఇక, పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ 2,116 ను రూ 500 పెంచి అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దశల వారీగా పెంచాలని. దీని పైన బడ్జెట్ లో స్పష్టత ఇవ్వనున్నారు.అదే విధంగా రైతు భరోసా, రైతు బీమా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, జ్యోతి, సన్నాహాలకు రూ.500 చొప్పున బోనస్, సబ్సిడీ వంటి పథకాలకు తగినన్ని నిధులు మంజూరు చేసే అవకాశం. ఇక, బడ్జెట్‌లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయటం జరిగింది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ప్రస్తుత పాఠశాల వరకే ఈ పథకం అమలవుతోంది. దీనిని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేసినట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ను కూడా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు తెలిసింది. ఒకటో తరగతి నుంచి జూనియర్ కాలేజీ వరకు దీనిని అమలు చేయాల్సిన సమాచారం. ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ‘వెల్‌ఫేర్ ఫండ్’ను ప్రకటించనుందని సమాచారం. దేవాదాయ శాఖ పరిధిలోని వృద్ధ అర్చకులకు పెన్షన్లను కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

