seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 4:58 am Digital Edition : SEEMA KIRANAM

బంగారం ధరల్లో బిగ్ క్రాష్ | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు నిలకడగా ఉండటంతో ఫెడ్ నిర్ణయానికి ముందు భారతదేశంలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయి

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు భారీగా పెరిగిన పసిడి రేట్లు నేడు తగ్గుముఖం పట్టాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై యుద్ధ ప్రభావం నేపథ్యంలో పెట్టుబడిదారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరల స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రశ్నార్థకంగా మారడం దీనికి తోడైంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు 1,57,410 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 1,44,290 రూపాయలకు చేరింది. జనవరిలో బంగారం 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో 1,80,000, వెండి 4,20,000 రూపాయలను తాకిన విషయం తెలిసిందే. దాని తర్వాత క్రమంగా కుప్పకూలుతూ వస్తోన్నాయి పసిడి రేట్లు. వెండి కూడా దీన్నే అనుసరిస్తోంది.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు నిలకడగా ఉండటంతో ఫెడ్ నిర్ణయానికి ముందు భారతదేశంలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయి

నేడు ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్లు రూ. 1,58,240, 22 క్యారెట్లు రూ. 1,45,060ల వద్ద ట్రేడ్ అయింది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్లు రూ. 1,58,140 కాగా 22 క్యారెట్లు రూ. 1,44,960లుగా నమోదైంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణే, ముంబైలలో 24 బంగారం రూ. 1,58,090, 22 క్యారెట్లు రూ. 1,44,910 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా యూఎస్‌ఎస్ స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు 5,000.77, ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి 5,004.60 డాలర్లకు లభిస్తోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,895, 22 క్యారెట్లు – రూ. 14,570, 18 క్యారెట్లు – రూ. 12,240

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు – రూ. 11,831

ఆంగ్ల సారాంశం

US ఫెడరల్ రిజర్వ్ యొక్క విధాన నిర్ణయానికి ముందు మధ్యప్రాచ్య సంఘర్షణ యొక్క ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తూ, పెట్టుబడిదారులు పక్కనే ఉండడంతో భారతదేశంలో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు తగ్గాయి.

Source link