వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల అనంతరం అమాంతం వీటి రేట్లు పెరిగాయి. గత వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు ఏకంగా 9,430 రూపాయల మేర ప్రియం కాగా, 22 క్యారెట్ల బంగారం ధరలో 8,550 రూపాయల పెరుగుదల నమోదైంది. వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వారం ముగిసేసరికి రికార్డు స్థాయికి చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. రూ. 1,75,000 నుండి 1,80,000 రూపాయల వరకు వెళ్లొచ్చు.
మల్టీ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3.15 శాతం పెరిగింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రాకెట్ లా దూసుకెళ్లింది ఏకంగా 1,67,217 రూపాయలకు చేరింది. ఆ తర్వాత ఇది ఎక్కడా ఆగలేదు. 3.25 శాతం ఎగబాకింది. 1,68,000 వరకూ వెళ్లింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బంగారం రేట్లు పెరగడం ఇదే తొలిసారి. కిలో వెండి ధర కూడా ఒక్కసారిగా జంప్ అయింది. 2.92 శాతం మేర పెరుగుదల కనిపించింది. రూ. 2,90,900 రూ. 2,93,887 వరకు పెరిగింది.

అంతర్జాతీయ కామిక్స్ (కామెక్స్) మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5,350 డాలర్ల మార్కును అధిగమించింది.. 5,345.50 నుండి రెండు శాతం మేర పెరుగుదలతో 5,351.60 వద్ద ఉంది. వెండి ధర కూడా ఔన్సుకు 0.81 నుండి 1.08 శాతం అంటే 94.30 డాలర్ల వరకు పుంజుకుంది. అంతర్జాతీయంగా వీటి రేట్లకు ఏ స్థాయిలో డిమాండ్ పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. పెట్టుబడుల భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్కెట్ అస్థిరంగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 17,210, 22 క్యారెట్లు – రూ. 15,776, 18 క్యారెట్లు – రూ. 13,501
ముంబై..
24 క్యారెట్లు – రూ. 17,309, 22 క్యారెట్లు- రూ. 15,866, 18 క్యారెట్లు – రూ. 12,982
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు – రూ. 12,355

