seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 12:58 am Digital Edition : SEEMA KIRANAM

బంగారం ఢమాల్! ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? | గోల్డ్ మిస్టరీ: US-ఇరాన్ యుద్ధం ఉన్నప్పటికీ ధరలు ఎందుకు క్రాష్ అవుతున్నాయి; మార్కెట్ కరెక్షన్ వెనుక 5 షాకింగ్ కారణాలు

వ్యాపారం

-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, తుపాకుల మోత వినిపించినప్పుడు.. ప్రపంచమంతా భయంతో చూసేది ‘బంగారం’ వైపు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది! ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు విరుచుకుపడుతున్నా.. గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా.. అందరి అంచనాలను ముంచేస్తూ బంగారం, వెండి ధరలు అగాధంలోకి పడిపోతున్నాయి. అసలు యుద్ధం జరుగుతుంటే బంగారం ఎందుకు చౌకగా మారుతోంది? ఆర్థిక సూత్రాలకే సవాల్ విసురుతున్న ఈ వింత పరిణామం వెనుక ఉన్న ‘ఐదు’ అసలు కారణాలు ఏంటి?

షాకింగ్ సంఘటనలు: పదినే పతనం!

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పుడు ఆకాశన్నంటుతుందనుకున్న బంగారం, కేవలం పది రోజుల్లోనే 5.7 శాతం మేర పడిపోయి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేసింది.

  • బంగారం: అంతర్జాతీయంగా $5,416 నుండి $5,103కి.. ఇండియాలో ₹1.67 లక్షల నుండి ₹1.60 లక్షల దిగువకు చేరింది.
  • వెండి: కిలో వెండి ఏకంగా 9 శాతం క్షీణించి ₹2.63 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది.
గోల్డ్ మిస్టరీ US-ఇరాన్ యుద్ధం ఉన్నప్పటికీ ధరలు ఎందుకు క్రాష్ అవుతున్నాయి 5 మార్కెట్ దిద్దుబాటు వెనుక షాకింగ్ కారణాలు

బంగారం ధరలు తగ్గడానికి 5 ప్రధాన కారణాలు:

1. బలపడుతున్న అమెరికా డాలర్:

యుద్ధ మేఘాల వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. చమురు వ్యాపారం అంతాలోనే జరుగుతుంది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. డాలర్ అదనపు పెట్టుబడిదారులు బంగారం కంటే డాలర్ ఆస్తులపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

2. లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్):

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధం వార్త రాగానే ధరలు పీక్‌కు చేరినట్లు భావించిన ఇన్వెస్టర్లు, తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు (ప్రాఫిట్ బుకింగ్). దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ధరలు తగ్గాయి.

3. బాండ్ దిగుబడులు పెరగడం:

అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యమవుతుందనే అంచనాలు, బ్యాండ్ దిగుబడులు పెరగడం వల్ల బంగారానికి ఆకర్షణ తగ్గింది. వడ్డీ ఇచ్చే బాండ్ల కంటే, వడ్డీ లేని బంగారంపై పెట్టుబడి పెట్టడం భారంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

4. చమురు రంగం వైపు నిధుల మళ్లింపు:

యుద్ధం వల్ల కొరత ఏర్పడవచ్చనే భయంతో, చాలా మంది పెట్టుబడిదారులు తమ నిధులను బంగారం నుండి ముడి చమురు (క్రూడ్ ఆయిల్), రక్షణ రంగ స్టాక్స్‌ (డిఫెన్స్ స్టాక్స్) మళ్ల వైపు.

5. స్టాక్ మార్కెట్ల పతనం:

ఇటీవల సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు వచ్చినప్పుడు, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి లేదా నగదు లభ్యత (లిక్విడిటీ) కోసం ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముతుంటారు. ఇది కూడా ధరలు తగ్గడానికి కారణమైంది.

ప్రస్తుతానికి ఈ యుద్ధం కేవలం పశ్చిమ ఆసియాకే పరిమితం అవుతుందని, ప్రపంచ యుద్ధం మారదని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నాయి. అందుకే ‘పానిక్ బయింగ్’ (భయంతో కొనుగోలు చేయడం) కనిపించడం లేదు. అయితే, యుద్ధ పరిస్థితులను బట్టి స్వల్పకాలంలో ఈ ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు.

ఆంగ్ల సారాంశం

US-ఇరాన్ వివాదం ఉన్నప్పటికీ బంగారం మరియు వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయో కనుగొనండి. బలమైన US డాలర్, ప్రాఫిట్ బుకింగ్ మరియు పెట్టుబడులను ముడి చమురుకు మార్చడం వంటి 5 కీలక అంశాలను విశ్లేషించండి.

Source link