seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 10:08 am Digital Edition : SEEMA KIRANAM

ఫలితాల వేళ బిగ్ ట్విస్ట్, రంగంలోకి కీలక నేతలు – సీన్ ఛేంజ్..!! | మునిసిపల్ ఎన్నికల ఫలితాలు దాదాపు 12 మునిసిపాలిటీలలో హంగ్, పార్టీలు ఎన్నికైన అభ్యర్థులతో క్యాంపు రాజకీయాలను ప్రారంభించాయి, వివరాలు ఇక్కడ ఉన్నాయి

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, బీజేపీకి నామమాత్రంగా మున్సిపాల్టీలు దక్కుతున్నాయి. ఒక కార్పోరేషన్ బీజేపీ ఖాతాలో పడటం ఖాయంగా మారింది. ఇదే సమయంలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని కార్పోరేషన్ల ఫలితాలు హోరా హోరీగా మారాయి. దీంతో.. ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతీ క్షణం ఉత్కంఠగా మారుతోంది.

తెలంగాణ మున్సిపల్ అధికార మెజార్టీ మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో విజయం సాధించింది. మెదక్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ కు ఏకపక్ష ఫలితాలు కనిపిస్తున్నాయి. 90 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. బీఆర్ఎస్ కేవలం 12, బీజేపీకి ఒక్క మున్సిపాల్టీకి పరిమితం అయ్యే అవకాశం లేదు. ఏడు కార్పోరేషన్లలో 5 కాంగ్రెస్ గెలుస్తుండగా.. బీజేపీ ఒక స్థానం, ఇతరులు మరో స్థానం దక్కించుకున్నట్లు ట్రెండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ కు ఒక్క కార్పోరేషన్ కూడా దక్కకపోవటం ఆ పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక.. మరో 12 మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు.

మునిసిపల్-ఎన్నికల-ఫలితాలు-12-మున్సిపాలిటీలలో-హంగ్-ఉంటాయి-పార్టీలు-క్యాంపు-రాజకీయం-ప్రారంభం-ఎన్నికలతో

హంగ్ మున్సిపాల్టీల్లో కీలకంగా మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు

హంగ్ ఏర్పడిన స్థానాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. గెలిచిన సభ్యులను పార్టీల క్యాంపులకు తరలిస్తున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారుతున్నారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పరకాల మున్సిపాలిటీ, అలంపూర్‌, నర్సాపూర్‌, సంగారెడ్డిలో జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్‌, ఆసిఫాబాద్‌, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మెజార్టీ కాంగ్రెస్ నుంచే ఉన్నారు. అదే విధంగా ఎంపీలు బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఉన్నారు. దీంతో.. గెలిచిన ప్రతీ సభ్యుడు పార్టీలకు కీలకంగా మారుతున్నారు. బీజేపీ ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటింగ్ లో ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. తుది ఫలితాల తరువాత ఈ హంగ్ మున్సిపాల్ పైన ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ చేసే అవకాశం ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే తుది ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.

ఆంగ్ల సారాంశం

మునిసిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్, బీజేపీలకు పెద్ద షాక్‌గా మారడంతో కీలక నేతల ప్రచారం తర్వాత కాంగ్రెస్ వన్ సైడ్ విజయం సాధించింది

Source link