seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 5:24 am Digital Edition : SEEMA KIRANAM

ప్లకార్డులతో జగన్ నిరసన, కీలక డిమాండ్ – హెచ్చరిక..!! | ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ నిరసన ర్యాలీలో వైఎస్ జగన్ పాల్గొన్నారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ సీఎం జగన్ నిరసనకు దిగారు. ప్లకార్డులు చేత అసెంబ్లీ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నిరసన లో ఉంది. పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. సభలో ప్రతిపక్ష పార్టీ గా మాట్లాడే అవకాశం ఇవ్వరు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం వేళ సభలో వైసీపీ సభ్యులు పొడియం చుట్టు ముట్టారు. శాంతి భద్రతలు కాపాడాలంటూ నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వాకౌట్ చేసారు. పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు. అసెంబ్లీ పరిసరాల్లో సహచర సభ్యులతో కలిసి మాజీ సీఎం జగన్ నిరసనగా సభకు చేరుకున్నారు. చేతిలో ప్లకార్డులతో జగన్ సభ వరకు నిరసన ప్రదర్శనలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. శాంతి భద్రతలు కాపాడాలని… మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపాలని… ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. లడ్డూ పై అసత్య ప్రచారం అంటూ నినాదాలు ఇచ్చారు. పోడియం ను వైసీపీ సభ్యులు చుట్టు ముట్టడంతో మార్షల్స్ సభలోకి వచ్చారు. కాసేపటికి వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేసారు. తరువాత పార్టీ సభ్యులతో జగన్ సమావేశమయ్యారు.

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీకి పార్టీ నేతలతో కలిసి నిరసన ర్యాలీలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

కాగా, తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఇదే తరహాలో కొనసాగితే సహించేది లేదని తెలుస్తోంది. కాగా.. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్లేందుకు జగన్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులు, ఆర్దిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. కాగా.. గవర్నర్ ప్రసంగం అయిన తరువాత బీఏసీ సమావేశం. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి .. అజెండా ఖరారు చేయనుంది. బీఏసీకి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల గురించి సభలో చర్చించి.. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, సమావేశాలు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉండటంతో… పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి ఉంది.

ఆంగ్ల సారాంశం

ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ జగన్ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు

Source link