తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
హోలీ పండుగ సందర్భంగా అదనపు రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య ఉన్నాయి. తొలి రైలు ఈ నెల 21న పట్టాలెక్కనుంది. మార్చి 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి- మడార్, తిరుపతి- రాక్సౌల్ మధ్య ఇవి రాకపోకలు సాగిస్తాయి.
చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్..
ఈ నెల 23, 28, మార్చి 2 తేదీలలో సాయంత్రం 7:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07023 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 5 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ కు చేరుకుంటుంది.

ఈ నెల 25 మార్చి 2, 4, తేదీలలో ఉదయం 7:15 నిమిషాలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బయలుదేరే నంబర్ 07024 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 5:20 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఖాజీపేట్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్హర్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
చర్లపల్లి- మదార్..
ఈ నెల 28న రాత్రి 11:45 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరే నంబర్ 07119 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 3:35 నిమిషాలకు మడార్ కు చేరుకుంటుంది.
మార్చి 3వ తేదీ ఉదయం 8:20 నిమిషాలకు మడార్ నుండి బయలుదేరే నంబర్ 07120 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 11:20 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
బొల్లారం మెదక్, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి, వషీం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇటార్సీ, రాణి కమలాపతి, సీహోర్, మాక్సీ, ఉజ్జరాబాద్, రత్లాం, మందసౌర్, నాముచ్, చిత్తౌర్గవాఢనగర్ అజ్మీర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగుతుంది.
తిరుపతి- రాక్సౌల్..
ఈ నెల 21, మార్చి 7 తేదీలలో ఉదయం 8:15 నిమిషాలకు తిరుపతి నుండి బయలుదేరే నంబర్ నంబర్ 07051 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు రక్సౌల్ కు చేరుకుంటుంది.
ఈ నెల 24, మార్చి 3, 10, తేదీలలో ఉదయం 8:30 గంటలకు రాక్సౌల్ నుండి బయలుదేరే నంబర్ 07052 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణ, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, గోహర్షా, చందా ఫోర్ట్, వడ్సా ఝార్సుగూడ, రూర్కెలా, హాతియా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, చంద్రాపుర, ధన్బాద్, బరక్కర్, చిత్తరంజన్, మాధుపూర్, జసిడి, ఝాఝా, కియుల్, బరౌని, సమస్తిపూర్, దర్భంగా, సీతామర్హి మీదుగా రాకపోకలు ఉంటాయి.

