seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 11:21 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రముఖ కవి నంది సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. | నందినిసిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలంగాణ కవిత్వం జాతీయ స్థాయిలో మెరిసింది.

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రముఖ తెలుగు సాహితీవేత్త, తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు డాక్టర్ నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవిత సంపుటికి ఈ పురస్కారం లభించింది. గుర్తించే సమయంలో పరిస్థితులపై ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. ఇక నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై తెలుగు కావులు, కవులు, రచయితలు, తెలంగాణ వాదులు ఆయనకు భాషా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రముఖ కవి, ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డిని ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అనిమేష’ కవిత సంపుటికి గాను ఈ గౌరవం దక్కింది. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

“తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం.. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు సిధారెడ్డికి తన తరపున, పార్టీ అభినందనలు తెలియజేసారు.

నందినిసిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం తెలంగాణ కవిత్వం జాతీయ స్థాయిలో మెరిసింది.

ఇక నందిని సిధారెడ్డి 1955 జూన్ 12న మెదక్ ఏర్పాటు బండారం గ్రామంలో జన్మించారు. బండారం, వెల్కటూర్, సిద్ధిపేటలోని పాఠశాలల్లో చదువుకున్నారు. అనంతరం ఉస్మానియా వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎం. ఏ., ఎం. ఫిల్., పీ. హెచ్. డీ. పట్టాలను అందుకున్నారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. 2012లో ఆయన పదవీ విరమణ చేశారు. 1997లో నందిని సిధారెడ్డి రచించిన “నాగేటి సాళ్ళలో నా తెలంగాణ” అనే కవిత ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

Source link