Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణప్రమాదం అంచున పాకిస్థాన్.. 21 ఏళ్లలో ఇదే తొలిసారి..! | పాకిస్తాన్ నిరుద్యోగం 21-ఏళ్ల గరిష్ట...

ప్రమాదం అంచున పాకిస్థాన్.. 21 ఏళ్లలో ఇదే తొలిసారి..! | పాకిస్తాన్ నిరుద్యోగం 21-ఏళ్ల గరిష్ట స్థాయికి 7.1 శాతానికి చేరుకుంది: సంక్షోభం తీవ్రతరం కావడంతో 8 మిలియన్లకు పైగా నిరుద్యోగులు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

దాయాది దేశం పాకిస్తాన్ లో నిరుద్యోగం పెరిగిపోతుంది. నిరుద్యోగిత రేటు 7.1 శాతం పెరిగినట్లు చెబుతున్నాయి. గత 21 ఏళ్లలో ఇదే అత్యధిక నిరుద్యోగిత రేటు అని తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయం బయటకు వచ్చింది. పాకిస్థాన్ లో నిరుద్యోగం పై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే పదేళ్లలో పాకిస్థాన్‌లో దాదాపు 3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.

అలాగే ఏటా 30 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అజయ్ బంగా స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్ లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2025లో దాదాపు 4 వేల మంది వైద్యులు ఆ దేశాన్ని వీడి ఇతర దేశాలకు వెళ్లారు. అలాగే మిగిలిన ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు కూడా భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగిత మరింతగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది.

2025లో నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో 7.1 శాతం పెరిగింది. గత 21 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం అక్కడి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పాకిస్థాన్ లోని షెహబాజ్ ప్రభుత్వం తాము దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించామని గొప్పలు చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు ఉన్నాయి. ఇక దేశంలో యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కాకుండా వృత్తిపరమైన గౌరవం, ఆర్థిక భద్రత లేకపోవడమే నిరుద్యోగానికి కారణం అని న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక కథనం స్పష్టం అవుతోంది.

పాకిస్తాన్ నిరుద్యోగం సంక్షోభం తీవ్రతరం కావడంతో 21 సంవత్సరాల గరిష్ట స్థాయికి 7 1 శాతానికి చేరుకుంది 8 మిలియన్లకు పైగా నిరుద్యోగులు

పాకిస్తాన్లో ఎక్కడికక్కడ పరిశ్రమలు, తయారీ సంస్థలు మూతపడుతుండటం, తయారీదారులు విదేశాలకు తరలిపోతున్నప్పుడు పాకిస్థాన్ ఆర్థిక రంగం తీవ్ర ఒత్తిడిని చూపుతోంది. ఏప్రిల్ 22 న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందిన నేపథ్యంలో భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular