ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన సేవలు
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ
కర్నూలు వైద్యం, మార్చి 11, (సీమకిరణం న్యూస్):

ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన సేవలతో పాటు డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కర్నూలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నుండి ప్రారంభమై, రాజ్‌విహార్ సెంటర్ వరకు కొనసాగింది. తిరిగి రాజ్‌విహార్ సెంటర్ నుండి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వరకు కోనసాగింది. సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లుతో పాటు నెఫ్రాలజీ డాక్టర్లు మరియు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలి,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ విభాగము నుండి డాక్టర్ సోమ అనంత్ అసోసియట్ ప్రొఫెసర్ మరియు హెచ్వోడి, డాక్టర్ వెంకట పక్కి రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ శ్రీధర్ శర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు వైద్య సిబ్బంది, డయాలసిస్ టెక్నీషియన్స్, 200 వందలకు పైగా నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.