seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 8:25 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రభుత్వ ఆసుపత్రిలో ఐటమ్ సాంగ్‌కి స్టాఫ్ నర్సులు స్టెప్పులు..పలువురు సస్పెండ్! | రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో నర్సుల డ్యాన్స్.. స్టాఫ్ నర్సుల సస్పెన్షన్, నర్సులకు షోకాజ్ నోటీసులు

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సిన కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటమ్ సాంగ్స్ కు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసుపత్రిలో పేషంట్లు ఉన్నారు అన్న పరిశీలన కూడా మరిచిపోయి వారు డాన్సులు చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రిలో ఐటమ్ సాంగ్ కు నర్సుల డ్యాన్స్

వైరల్ అయిన వీడియోలో ఇద్దరు నర్సులు ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు. మరికొందరు సిబ్బంది చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో మహిళా దినోత్సవం ముందు రోజు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణకు విచారణ చేపట్టారు.

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో నర్సుల నృత్యం నర్సులకు షోకాజ్ నోటీసులు సస్పెండ్ చేశారు

నర్సులు చేసిన డ్యాన్సులపై పెద్ద ఎత్తున విమర్శలు

రోగుల సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమైనది. అటువంటి నర్సులు రోగుల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆసుపత్రి వేదికగా డాన్సులు చేయడం అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రిలో పేషెంట్లు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా నర్సులు చేసిన డ్యాన్సులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తిని చేకూర్చి, స్టాఫ్ నర్సులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం పైన తీవ్రంగా స్పందించారు.

ఆ నర్సులు సస్పెండ్

తక్షణ చర్యలను తీసుకుంటూ హెడ్ నర్సులు మెర్సీ మరియు ఈశ్వరి క్షణమే సస్పెండ్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంతేకాదు వీరిద్దరూ డాన్స్ చేస్తుంటే, ప్రోత్సహించిన మరో 12 మంది నర్సింగ్ సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎవరైనా సరే విధినిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తగిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఆస్పత్రుల్లో పని చేసే వారికి హెచ్చరిక

పవిత్రమైన వైద్య వృత్తిలో ఇలాంటి ధోరణి మంచిది కాదని నిర్లక్ష్య పూరితమైన చర్యలు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. మొత్తంగా ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.

ఆంగ్ల సారాంశం

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు ఐటెం సాంగ్ కోసం డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది, ఈ ఘటనపై అధికారులు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Source link